అరెస్ట్ చేశాని, అరెస్టులో ఎలాంటి రాజకీయ కుట్ర, కక్షసాధింపు ఏమీ లేవని
రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత స్పష్టం చేశారు. శనివారం హోంమంత్రి
క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అరెస్ట్ పై వివరాలను ఆమె మీడియా ప్రతినిధులకు
వెల్లడించారు. తానేటి వనిత మాట్లాడుతూ అరెస్ట్ సమయంలో పోలీసులు నోటీసులు
ఇచ్చి సంతకాలు కూడా తీసుకున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అనవసరం
రాద్దాంతం చేస్తున్నాయని, వాస్తవాలను తెలసుకుని మాట్లాడాలని చురకలు
అంటించారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు అనవసర రాద్దాతం చేయాలని చూస్తున్నాయని,
నిబద్దతతోనే పనిచేస్తున్నామని, కుట్రలు చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి
లేదని తెలిపారు. గతంలో జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ కుట్రలతో అరెస్ట్
చేయించారని, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ఆయన చేసిన తప్పిదాలు, అవినీతి వల్లనే
జరిగిందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అరెస్ట్ లను ఏ విధంగా ఖండిస్తారో
సమాధానం చెప్పాలన్నారు. ఆమె ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు.
గతంలో అమిత్ షా పై రాళ్లు వేయించినప్పుడు గానీ లేక ప్రధాని మోడీని
తిట్టించిన వారిని ఆమె సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. పురందేశ్వరి
పార్టీకి నిబద్దతతో ఉన్నారా..? లేక బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా? సమాధానం
చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీ, జీఎస్టీ వంటి కేంద్ర సంస్థలు తప్పు చేశాయని
బీజేపీ చెప్పదల్చుకుందా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఒక్క మాట మాట్లాడని
పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్ట్ తో ఈ రోజు ముందుకొచ్చారన్నారు. ఈ స్కాంలో
పవన్ కళ్యాణ్ కు అందుతున్న ప్యాకేజీ ఎంత? అని ఆమె ప్రశ్నించారు.