తిరుమల : తిరుమలలో సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు
జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై టీటీడీ సివిఎస్వో
నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కలిసి శుక్రవారం సాయంత్రం
తిరుమల అన్నమయ్య భవనంలో పోలీసు, విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి పర్యటన, గరుడ సేవ,
రథోత్సవం, చక్రస్నానం లాంటి విశేషమైన రోజుల్లో గత అనుభవాలను దృష్టిలో
ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాలకు వాహనాల్లో
వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్రదేశాలకు సూచికబోర్డుల
ఏర్పాటుతోపాటు అదనంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమైన ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు
ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో తిరుమల అదనపు ఎస్పి మునిరామయ్య, ఎస్టేట్
విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జున, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శాస్త్రి,
డెప్యూటీ ఈఓ భాస్కర్, విజివోలు బాలిరెడ్డి, గిరిధర్ రావు, నందకిషోర్ ఇతర
పోలీసు, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.