సకాలంలో యూనిట్లు ఏర్పాటు అయ్యేలా చూడాలి
విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కెఎస్.జవహర్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష
విజయవాడ : ఎంఎస్ఎంఇ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ పై శుక్రవారం విజయవాడలోని సిఎస్
క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ
చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు
కల్పించేందుకు వీలున్నందున ఆయా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే
ఔత్సాహికులకు తగిన తోడ్పాటును అందించి సకాలంలో యూనిట్లు ఏర్పాటు అయ్యేలా
చూడాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.ఎంఎస్ఎంఇ కార్యక్రమం కింద నమోదైన
వివిధ రకాల యూనిట్లు వాటి ప్రగతిని ఆయన సమీక్షించారు.
అదే విధంగా కొప్పర్తి, గుంటూరుల్లో ఏర్పాటు అవుతున్న ఎంఎస్ఎంఇ టెక్నాలజీ
కేంద్రాల ప్రగతిని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే
ఎంఎస్ఎంఇ రంగానికి సంబంధించిన సేవలను మరింత సులభతరం చేసేందుకు రూపొందిస్తున్న
వైయస్సార్ ఎపి ఒన్ ఫ్లాట్ ఫారమ్ గురించి ఆయన సమీక్షించారు.అంతేగాక
ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు తీసుకుంటున్న చర్యలను,కామన్
ఫెసిలిటీ కేంద్రాల గురించి సిఎస్ డా.జవహర్ రెడ్డి సమీక్షించారు. ఈసమావేశంలో
రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ద్వారా ఎంఎస్ఎంఇ రంగంలో చేపట్టిన పలు ఇనిషియేటివ్స్ పై వివరించారు. ఇంకా ఈ
సమావేశంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఎంఎస్ఎంఇ సిఇఓ,
పరిశ్రమల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్,ఆశాఖ జెడి. రామలింగేశ్వర రాజు,ఇతర
అధికారులు పాల్గొన్నారు.