విజయవాడ : సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ జైన్ తో రాష్ట్ర
ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుక్రవారం
సికింద్రాబాద్ లోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రైల్వే అభివృద్ధి పనులపై సుధీర్ఘంగా చర్చించారు.
నగరంలో నెలకొన్న రైల్వే సమస్యలపై ఇప్పటికే రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి
కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గ
ప్రాంతంలోని రైల్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విజయవాడ
నగరంలోని జనాభా, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా పలు చోట్ల రైల్వే ఓవర్
బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా
ఉందని జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతీరోజు 70 నుంచి 180 సార్లు గేటు
పడుతుండటంతో ఆయా ప్రాంతాల విద్యార్థులు, ఉద్యోగులు, రోజు వారి కూలీలు,
పేషెంట్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. కనుక నియోజకవర్గ ప్రజల
అవసరాల దృష్ట్యా గుణదలలో km 434/20-22 వద్ద ఒకటి., గుణదల km 5/6-7 వద్ద
మరొకటి., మధురానగర్ పప్పుల మిల్లు వద్ద, రాజరాజేశ్వరి పేటలలోని రైల్వే గేట్ల
వద్ద గతి శక్తి ప్రాజెక్టు కింద రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్.ఓ.బి.) నిర్మాణాలను
చేపట్టాలన్నారు. వాంబేకాలనీలో రైల్వే ట్రాక్ వద్ద గేటు లేకపోయినప్పటికీ ఆ
ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి.. ప్రత్యేక చొరవతో ఆర్.ఓ.బి. నిర్మాణానికి
అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే అజిత్ సింగ్ నగర్ – రామక్రిష్ణాపురం
ఆర్.యు.బి వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అదనంగా మరో బాక్స్ మార్గానికి
అనుమతులు ఇవ్వవలసిందిగా కోరారు. మరోవైపు శ్రీనగర్ కాలనీ రైల్వే గేట్లు
మూసివేయటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు జీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
వీఎంసీ అధికారుల సమన్వయంతో సమస్యకు పరిష్కారం చూపవలసిందిగా విన్నవించారు.
రామకృష్ణాపురం – దేవీనగర్ రైల్వే అండర్ పాస్ వద్ద జరగవలసిన రహదారి నిర్మాణం,
యూజీడీ, వాటర్ లైన్ పనులకు రైల్వే పర్మిషన్లు లేకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కావున తక్షణమే
రైల్వే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. జీవీఆర్ నగర్లో కొత్తగా వేసిన యూజీడీ
లైన్లను.. అజిత్ సింగ్ నగర్లోని ఎస్టిపి(సూయజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)కి
అనుసంధానించేందుకు వీలుగా పెండింగ్ లో ఉన్న రైల్వే అనుమతులను క్లియర్
చేయవలసిందిగా విన్నవించారు. బసవతారక నగర్, రామకృష్ణాపురం రైల్వే ట్రాక్ వెంబడి
డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేయవలసిందిగా
కోరడంతో.. ఆయా అంశాలపై జీఎం సానుకూలంగా స్పందించినట్లు మల్లాది విష్ణు
తెలిపారు. సమీక్షలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.