లక్ష్యంతో జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. ప్రతిష్ఠాత్మక ఈ
శిఖరాగ్ర సదస్సుకు సర్వం ముస్తాబైన వేళ ఏ ఏ ఆశయాలు, లక్ష్యాలతో భారత్
ముందుకెళ్లాలనుకుంది?.
ప్రపంచార్థికంలో 75 శాతం వాటా ఉన్న జీ20 దేశాల ప్రతిష్ఠాత్మక సదస్సుకు
అధ్యక్షత వహిస్తున్న భారత్.. పలు కీలక ఆశయాల సాధన దిశగా ముందుకు వెళుతోంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచ వేదికపై భారతదేశం ఛాంపియన్‌గా ఉండాలని
ఆకాంక్షిస్తున్నట్లు జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే క్రమంలో ప్రధాని
నరేంద్ర మోడీ తెలిపారు. సమావేశాల ప్రారంభానికి ముందే అభివృద్ధి చెందుతున్న
దేశాల ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రష్యా- పశ్చిమ దేశాల మధ్య
మధ్యవర్తిగా అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచానికి మధ్య భారత్
వారధిగా ఉండేందుకు మద్దతివ్వాలని ఆయన కోరారు.
చరిత్రలో తొలిసారి సంయుక్త ప్రకటన లేకుండా
భారత్‌కు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సవాల్‌ను విసిరింది. మధ్యవర్తిత్వ
లక్ష్యాలను చేరే మార్గాన్ని క్లిష్టతరం చేసింది. జీ20 దేశాల మధ్య
భిన్నాభిప్రాయాలతో ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన జీ20 సమావేశాల్లో ఎక్కడా
ఉమ్మడి ప్రకటన రాలేదు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత
జిన్‌పింగ్ సదస్సుకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో
దేశాధినేతలు ఈ ప్రతిష్టంభనను అధిగమించకపోతే, చరిత్రలో తొలిసారి సంయుక్త ప్రకటన
లేకుండా ఈ సదస్సు ముగిసే అవకాశం ఉంది.
భారత్ ను ఎటూ తేల్చుకోలేని విధంగా
మాస్కోతో భారత్‌కు ఉన్న సత్సంబంధాలు, పశ్చిమదేశాలతో పెరుగుతున్న ద్వైపాక్షిక
బంధాలు భారత్‌ను ఎటూ తేల్చుకోలేని విధంగా చేస్తున్నాయి. జీ20 సదస్సు సంపూర్ణ
విజయంపై నీలినీడలు కమ్ముకున్నందున.. అభివృద్ధి చెందుతున్న దేశాల ముఖ్య
సమస్యలైన ఆహారం, ఇంధన అభద్రత, ద్రవ్యోల్బణం, అప్పులు, బహుపాక్షిక అభివృద్ధి,
బ్యాంకుల సంస్కరణలపై భారత్ దృష్టిసారించింది. అందుకే జీ20ని మరింత
విస్తరించేందుకు ఆఫ్రికన్ సమాఖ్యను జీ20లో భాగం చేయాలని భారత్ ప్రతిపాదనలు
చేసింది.