వైద్య ఆరోగ్య శాఖలో మరో మైలురాయి
ఇంటింటికీ వాలంటీర్ల ద్వారా ఆరోగ్య సర్వే
గడపగడపకూ ఎఎన్ ఎంలు, సీహెచ్‌వోలు
ఇళ్ల వద్దకే వచ్చి వైద్య పరీక్షలు
అదే గ్రామంలో వైద్య శిబిరాలు
సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు సొంత ఊళ్లలోనే
కావాల్సిన మందులు సిద్ధం చేయండి
గ్రామాల్లో ఏర్పాట్లను ముమ్మరం చేయండి
అన్ని విభాగాల సమన్వయం అవసరం
ఈ నెల 15 నుంచి వాలంటీర్లు ఇంటింటి సర్వే
అవసరమైన రోగులకు పెద్ద ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు
ఆరోగ్యశ్రీపై పూర్తి అవగాహన కల్పించే దిశగా చర్యలు
అధికారులు అప్రమత్తతో ఉండాలి
వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇదో గొప్ప కార్యక్రమం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష
గుంటూరు : వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో మరో గొప్ప కార్యక్రమానికి
ముఖ్యమంత్రివర్యులు వైఎస్జగన్ మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ
టవర్స్ లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం
మంత్రి విడదల రజిని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో జగనన్న ఆరోగ్య
సురక్ష పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ
సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం
ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఆరోగ్య భరోసా దక్కుతుందని
చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించడం,
అవసరమైనవారికి గ్రామాల్లోనే క్యాంపులు నిర్వహించి వైద్యం అందించడం,
పెద్ద ఆస్పత్రులకు సిఫారుసు చేయడం లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష
పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని
వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత రాష్ట్రవ్యాప్తంగా వారి
పరిధిలోని అన్ని కుటుంబాలకు వస్తారని తెలిపారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు
ఉన్నవారిని గుర్తించి ఎఎన్ ఎంలు, క్లస్టర్ హెల్త్ ఆఫీసర్లకు సమాచారం
ఇస్తారని చెప్పారు. తర్వాత ఎఎన్ ఎంలు, సీహెచ్‌వోలు ఇంటింటికీ వస్తారని,
అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. అదే గ్రామం,
వార్డుల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తారని చెప్పారు. ఈ శిబిరాలు జరిగే
సమయానికి అందరికీ ఆరోగ్య నివేదికలను ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలు సిద్ధం చేసి
ఉంచుతారని తెలిపారు. ఈ వైద్య శిబిరాలకు స్పెషలిస్టు డాక్టర్లు ఇద్దరు, ఆ
మండలంలోని పీహెచ్సీ డాక్టర్లు ఇద్దరు మొత్తం నలుగురు వస్తారని
తెలిపారు. రోగులకు అక్కడికక్కడే ఈ శిబిరంలో చికిత్స అందజేస్తారని
తెలిపారు. ఆరోగ్య సలహాలు సూచనలు ఇస్తారని చెప్పారు. అవసరమైన వారిని
పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స కోసం సిఫారుసు చేస్తారని వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల నుంచి కూడా డాక్టర్లు
ఈ క్యాంపునకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల నుంచి కూడా ఒక స్పెషలిస్టు
డాక్టర్ హాజరవుతారని చెప్పారు. నెల రోజులపాటు ప్రతి రోజూ ఈ క్యాంపులు
జరుగుతాయన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రోజూ
వైద్య శిబిరాలు కొనసాగుతాయని వెల్లడించారు. దీనివల్ల గ్రామాలు, వార్డుల్లో
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వారి గ్రామాల్లోనే స్పెషలిస్టు
వైద్యులతో సత్వర వైద్యం అందుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని
వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా
ముందుకుతీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
చేపట్టిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్, ఎంపీడీవో,
పీహెచ్‌సీల వైద్యాధికారులను ఈ కార్యక్రమ నిర్వహణకు బాధ్యులను
చేస్తున్నట్లు చెప్పారు. పట్టణప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్,
మున్సిపాలిటీ ఆరోగ్య అధికారి, యూపీహెచ్సీ వైద్యాధికారులను బాధ్యులను
చేస్తున్నామన్నారు. వీరందరి భాగస్వామ్యంతో ఊరూరా, వార్డు వార్డునా వైద్య
శిబిరాలు నిర్వహించబోతున్నామని వివరించారు.
పక్కా ప్రణాళికతో..
ఈ శిబిరాలను 30 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో నిర్వహించేలా ప్రణాళిక
రచించామని చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరుకు తొలి శిబిరం ప్రారంభిస్తామని
తెలిపారు. వచ్చే నెలాఖరు నాటికి అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణ
పూర్తవుతుందని వివరించారు. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, కాలేజీలు,
సచివాలయాల ప్రాంగణాలు, యూపీహెచ్సీ ప్రాంగణాలు ఇలా ఎక్కడ అనుకూల వసతులు
ఉంటే అక్కడ ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. తొలుత
వాలంటీర్లు ఇంటింటికీ వస్తారని తెలిపారు. ఆరోగ్యశ్రీ వివరాలతో కూడిన
కిట్లను అందజేస్తారని చెప్పారు. ఆ కిట్‌లో ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర
ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల వివరాలతోపాటు, నెట్ వర్కు పరిధిలోని
ఆస్పత్రుల జాబితా ఉంటుందని వెల్లడించారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు
ఉన్నవారిని వాలంటీర్లు గుర్తించి ఎఎన్ ఎంలు ఇళ్లకు వచ్చే షెడ్యూల్, చేసే
పరీక్షలు, క్యాంపు నిర్వహించే తేదీ తదితర వివరాలను వెల్లడిస్తారని
పేర్కొన్నారు. ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలు ఇంటింటికీ వచ్చి ఆరోగ్య వివరాలు
నమోదు చేస్తారని వెల్లడించారు. అవసరమైన వారికి బీపీ, షుగర్,
రక్తపరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. క్యాంపు జరిగేనాటికి
రోగులకు సంబంధించిన అన్ని రికార్డులను సిద్ధం చేస్తారని తెలిపారు. ఆ
రికార్డులు, రోగుల పరిస్థితిని బట్టి క్యాంపులలో వైద్యులు చికిత్స
అందజేస్తారని వివరించారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని ఆరోగ్యశ్రీ
నెట్ వర్క్ ఆస్పత్రులకు గాని, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులు, టీచింగ్
ఆస్పత్రులకు గాని కేసులను సిఫారుసు చేస్తారని వివరించారు.
అందుబాటులో మందులు, వైద్య పరికరాలు
వైద్య శిబిరం జరుగుతున్న ప్రతి చోటా 105 రకాల ఔషధాలు అందుబాటులో ఉంటాయని
చెప్పారు. అన్ని రకాల వైద్య పరికాలను కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయంవతంగా పూర్తయ్యేలా అధికారులు
చర్యలుతీసుకోవాలన్నారు. అందుకోసం వాలంటీర్లు, ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలకు
ప్రత్యేక శిక్షణ వెంటనే ఇవ్వాలని చెప్పారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు,
మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లకు వెంటనే మార్గదర్శకాలు
వెళ్లాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కిట్లు, ఆస్పత్రులకు సత్వరమే
చేరాలని చెప్పారు. శిబిరాలు నిర్వహించే ప్రాంతంలో వచ్చిన రోగులకు ఎలాంటి
ఇబ్బందులు తలెత్తడానికి వీల్లేదన్నారు. అన్ని శిబిరాల్లో భోజన సదుపాయం
కల్పించాలని చెప్పారు. మందులు సమయానికి శిబిరాల వద్దకు చేరాలని
చెప్పారు. వైద్య పరీక్షలు కూడా పక్కాగా జరగాలన్నారు. పూర్తిస్థాయిలో
అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా విభాగాలు సమన్వయంతో పనిచేసి
ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని
చెప్పారు. ఇప్పటికే అన్ని దశల అధికారులకు ఈ కార్యక్రమం గురించి సమాచారం
వెళ్లిపోయిందని తెలిపారు. ఈ నెల 8న ఈ కార్యక్రమ షెడ్యూళ్లను ఎంపీడీవోలు
విడదల చేయాలన్నారు.
16 నుంచి ఏఎన్ఎంల సందర్శక్
ఇంటింటికి వాలంటీర్ల సందర్శన ఈ నెల 15 వ తేదీ నుంచి మొదలు కావాలని
లక్ష్యం విధించారు. ఏఎన్ఎంల సందర్శన ఈ నెల 16న ప్రారంభంకావాలన్నారు.
మొదటి వైద్య శిబిరం ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 వ తేదీన
నిర్వహించాలన్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో గా అన్ని సచివాలయాల్లో వైద్య
శిబిరాలు పూర్తికావాలని స్పష్టం చేశారు. జగనన్న ఆశయాల మేరకు
అధికారులంతా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్
జె.నివాస్, కమిషనర్ ఏవీవీపీ వెంకటేశ్వర్, ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీ
మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీఎంఈ డాక్టర్
నర్సింహం, డీహెచ్ డాక్టర్ వి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.