వర్షాకాలంలో ఈ పులస ఎక్కువగా లభిస్తుంది. మార్కెట్లో ఈ చేపల ధర కిలోకు వేల
రూపాయలు పలుకుతుంది. మరి ఇంత డిమాండ్ ఉన్న పులస చేప తినడం వల్ల ఎలాంటి
లాభాలున్నాయో తెలుసుకుందాము..
ఎముకల బలం:
పులస చేపలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల బలానికి
తోడ్పడతాయి. ఎముకలు కాల్షియం సంగ్రహించడంలో దోహదపడతాయి.
క్యాన్సర్:
పులస చేపలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్
నివారిణిగా పనిచేస్తాయి. అందువల్ల వీటిని క్యాన్సర్ నిరోధకాలుగా చెప్పవచ్చు.
కొలెస్ట్రాల్:
పులస చేపల్లో ఆరోగ్యకర కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు
కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడతాయి.
గుండె ఆరోగ్యం:
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో పులస చేపలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్
సహాయపడతాయి. తద్వారా గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి హృదయ సంబంధ సమస్యలు
రాకుండా ఉంటాయి.
డయాబెటిస్:
ఇన్సులిన్ నియంత్రణలో కూడా పులస రక్తంలో ఉపయోగపడుతుంది. తద్వారా రక్తంలో
చక్కెర స్థాయిలో కంట్రోల్లో ఉండి షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు.
మెదడు:
పులస చేపల్లో విటమిన్ బీ12 అధికంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును
మెరుగుపరుస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.
కంటిచూపు:
పులస చేపలో విటమిన్ ఎ, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటిచూపును
మెరుగుపరుస్తాయి. అలాగే ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి.