అందువల్ల వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇదే కాదు ఈ పండు తినడం
వల్ల ఇంకా అనేక లాభాలున్నాయి.
చర్మ సౌందర్యం
బేరి పండ్లలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మంపై
ముడతల్ని పోగొట్టడంలో కాపాడుతుంది. యవ్వనంగా ఉంచుతుంది.
జుట్టు ఆరోగ్యం
బేరి పండ్లలోని విటమిన్ ఎ వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టును
దృఢంగా, ఒత్తుగా చేస్తుంది. అలాగే గోర్ల అందానికి కూడా మేలు చేస్తుంది.
ఎముకల బలం
బేరి పండ్లలో రాగి, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.
ఇవి ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి.
జ్వరం
జ్వరం వచ్చినపుడు, ఒళ్లు వేడి చేసినపుడు, గొంతునొప్పి ఉన్నపుడు బేరి పండ్లు
తినడం చాలా మంచిది. బాడీలోని వేడిని తగ్గించడంలో పియర్స్ పండ్లు సహాయపడతాయి.
గాయాలు
బేరి పండ్లలోని విటమిన్ సి గాయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాలిన,
తెగిన, గీసుకుపోయిన గాయాలను త్వరగా మానేలా చేస్తుంది.
రక్తహీనత
రక్తహీనతతో బాధపడేవారు బేరి పండ్లు తినడం చాలా మంచిది. ఈ పండ్లలోని కాపర్,
ఐరన్ బాడీలో ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతాయి.
రోగనిరోధక శక్తి
బేరి పండ్లలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి పలు అనారోగ్య సమస్యల నుంచి కాపాడతాయి.
వడదెబ్బ
వానాకాలంలో తేమ వల్ల బాడీలో నీటి శాతం కోల్పోతారు. దీంతో వడదెబ్బ తగిలే అవకాశం
ఉంది. అయితే బేరిపండ్లు తినడం వల్ల ఇందులోని నీరు బాడీని హైడ్రేట్ చేస్తుంది.
వడదెబ్బ నుంచి కాపాడుతుంది.