విజయవాడ : రాష్ట్రంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు
విశేషంగా కృషి చేస్తున్న రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్
విజయ్ కుమార్ మద్రాస్ ఈస్ట్ రోటరీ క్లబ్ వారిచే ఎమ్మెస్ స్వామినాథన్
పర్యవరణ పరిరక్షణ అవార్డ్- 2023 అందుకొన్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవ
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పార్లమెంట్ సభ్యులు కనిమొళి కరుణానిధి
చేతుల మీదుగా ఈ అవార్డు అందుకొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయాన్ని
ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న నేపథ్యంలో విజయ్
కుమార్ కు ఈ అవార్డు సొంతమైంది . ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం
అత్యున్నత స్థాయిలో సేవలందించే వ్యక్తులు లేదా సంస్థలకు మద్రాస్ ఈస్ట్ రోటరీ
క్లబ్ వారు గత పాతికేళ్లుగా ప్రతి ఏటా ఈ అవార్డు ను ప్రధానం చేస్తున్నారు.2023
వ సంవత్సరానికి గాను విజయ్ కుమార్ కు ఈ అవార్డు దక్కింది. రోటరీ క్లబ్ ఆఫ్
ఈస్ట్ మద్రాస్ లో గౌరవ సభ్యత్వం కలిగిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ గౌరవార్థం ఏటా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి
చేస్తున్న వారికి ఈ అవార్డు ను ప్రకటిస్తున్నారు.