చేసిన తప్పులకు శిక్ష తప్పదు
సాధారణ నోటీసులంటూ చిన్నమ్మ సమర్ధన
ఆధార్ లింక్ తో దొంగ ఓట్లు మాయం
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
గుంటూరు : చంద్రబాబు స్కాంలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, అమరావతి
కాంట్రాక్టులు స్కాం తరహాలోనే స్కిల్ స్కాం ముడుపులు బయటపడ్డాయని, నదులన్నీ
చివరికి సముద్రంలో కలిసినట్లు అన్ని స్కాంల ముడుపులు చంద్రబాబుకే
చేరుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి
రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బుధవారం పలు అంశాలపై ఆయన
స్పందించారు. అమరావతి కాంట్రాక్టులు తరహాలోనే స్కిల్ స్కాం లో కొల్లగొట్టిన
నిధులు చివరకు చంద్రబాబు నివాసానికే చేరాయని అన్నారు.
సాధారణ నోటీసులంటూ చిన్నమ్మ సమర్ధన : కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నందుకు
చంద్రబాబుకు వచ్చినవి సాధారణ నోటీసులు కావని లంచం రూపంలో కోట్ల రూపాయలు
ముడుపులు అందుకున్నందుకు ఇచ్చిన నోటీసులని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
గ్రహించాలని అన్నారు. బాబు హెరిటేజ్ డెయిరీకి ఐటీ నోటీసులు వస్తే ప్రతి
కంపెనీకి ఎప్పుడో ఒకప్పుడు ఈ విధమైన నోటీసులు రావడం సహజమేనని
సమర్దించుకోవచ్చని అయితే లంచం కింద కోట్లు చేరవేసిన బ్రోకర్ ఇచ్చిన వాంగ్మూలం
ఆధారంగా ఇచ్చిన నోటీసులు సాధారణ నోటీసులంటూ సమర్ధించడం ఎంతవరకు సమంజసమని
ప్రశ్నించారు. బాబుకు ఇచ్చినవి సాధారణ నోటీసులైతే ఆయన పెనాల్టీ చెల్లించి
బయటపడేవాడని, లంచం అందుకున్న నోటీసులు కావడంతో తప్పించుకోలేక తేలు కుట్టిన
దొంగలా కిమ్మనలేకపోతున్నాడని అన్నారు.
చేసిన తప్పులకు శిక్ష తప్పదు : సాక్షాధారాలు లేకుండా నేరాలు చేయడం, వెన్నుపోటు
పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విజయసాయి రెడ్డి అన్నారు. కాలం
చాలా బలమైనదని, వ్యవస్థలను జీవితాంతం మేనేజ్ చేయగలిగినా, శిక్ష
అనుభవించాల్సిన కాలం దగ్గర పడిందన్ని తత్వం బాబుకి బోధపడినట్లుందని అన్నారు.
చేసిన తప్పులు ఎప్పడో ఒకప్పడు ఏదో సమయంలో వెంటాడుతాయని చంద్రబాబుకి బాగా
తెలుసని ఆయనతో పాటు ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన ఆయన స్నేహితుడు చెరుకూరి
రామయ్య అలియాస్ రామోజీకి కూడా శిక్ష తప్పదని అన్నారు.
ఆధార్ లింక్ తో దొంగ ఓట్లు మాయం : ఓటర్ కు ఆధార్ లింక్ చేయడం ద్వారా దొంగ
ఓట్లు సమూలంగా నిర్మూలించవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా
విశ్వసిస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఛీఫ్ ఎలక్షన్
ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసి వైఎస్సార్సీపీ బృదం విజ్ఞప్తి చేసిందని
అన్నారు. చంద్రబాబు హయాంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలు సీఈఓ దృష్టికి
తీసుకువెళ్లిందని అన్నారు. ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలు సరిచేస్తుంటే ఓటమి
భయంతో టీడీపీ గగ్గోలు పెడుతోందని విజయసాయి రెడ్డి అన్నారు