తొలి చిత్రం ‘ధడక్’తోనే
హీరోయిన్ గా కుర్రకారు హృదయాలను గెలుచుకున్న
జాన్వీకపూర్, శ్రీదేవి కూతురిగా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినా, కొన్ని సినిమాలతోనే
ప్రతిభావంతురాలైన నటిగా నిరూపించుకుంది. హిందీలో అగ్రహీరోల చిత్రాల్లో
అవకాశాలు దక్కించుకుంటున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ కథానాయకుడిగా
నటిస్తున్న పాన్ ఇండియా చిత్ర “దేవర”లో నటిస్తోంది. సినిమాల్లోకి రాకముందే
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియాతో జాన్వీ
డేటింగ్ లో ఉంది. ఆరోజుల్లో ఇద్దరూ తరచూ
బయటక కనిపించారు. తన లవ్ రిలేషన్ షిప్ గురించి జాన్వీ ఇటీవలే ఓ ఇంటర్వూలో
చెప్పుకొచ్చారు. తన తొలి ప్రేమ కొద్దిరోజుల్లోనే ముగిసిపోయిందని ఆ వయసులో
మానసికంగా పరిణతి లేకపోవడమే దానికి కారణమన్నారు. తరచూ అబద్దాలు చెప్పాల్సి
రావడంతో ఇబ్బందిపడ్డాను. ఆ సమయంలో అమ్మానాన్న చదువుమీద ఫోకస్ పెట్టాలని
చెప్పారు. వారి మాట వింటే జీవితం బాగుంటుందని అర్థమై నా రిలేషన్ షిప్ కి
అక్కడితో ముగింపు పలికాను అని తెలిపింది.