ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. మెంతులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..
1.రక్తపోటు:
మెంతుల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో
ఉంటుంది. హైబీపీ ఉన్నవారు మెంతులు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
2.గుండె ఆరోగ్యం:
మెంతుల్లో గెలాక్టోమన్నన్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో
కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
3.మధుమేహం:
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతులు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
వీటిలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించే అమైనో యాసిడ్లు. ఉంటాయి. తద్వారా
షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
4.ఎముకల బలం:
మెంతులు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. మెంతుల్లో విటమిన్ కె
ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముక ద్రవ్యరాశిని బలోపేతం చేసి ఆస్టియోపోరోసిస్ వంటి
సమస్యలు రాకుండా కాపాడుతుంది.
5.జీర్ణశక్తి:
మెంతులు జీర్ణశక్తిని మెరుగుపర్చి ఆకలిని ప్రోత్సహిస్తాయి. అలాగే ఎసిడిటీ,
గ్యాస్ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా నివారించడంలో సహాయపడుతుంది..
6.పాల ఉత్పత్తికి:
పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి మెంతులు సహాయపడతాయి. అందువల్ల
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు మెంతులు తీసుకోవడం మంచిది.
7.జుట్టు ఆరోగ్యం
జుట్టు రాలడం, నెరిసిన జుట్టు వంటి సమస్యలు ఉన్నవారు మెంతులు తినడం చాలా
మంచిది. మెంతుల్లోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడు జుట్టు రాలే సమస్యను
నివారిస్తాయి.
8.రక్తహీనత:
మెంతుల్లో ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల
ఉత్పత్తికి దోహదపడి రక్తం లెవెల్స్ పెంచుతుంది. తద్వారా రక్తహీనతను
తగ్గిస్తుంది.