59 లక్షల ఓట్లు 2019కి ముందు డబుల్
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒకే ఇంట్లో 510 ఓట్లు
బోగస్ ఓట్లు, ఫేక్ ఓట్లు తొలగించాలని కోరాం
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యేలు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అనిల్
కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ భేటీ
వెలగపూడి సచివాలయం : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది
విష్ణు, అనిల్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ భేటీ అయ్యారు
సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ డూప్లికేట్ ఓటర్లు లేకుండా,
బోగస్, ఇన్వాలీడ్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరాం. ఒక మనిషికి ఒక
ఓటే ఉండాలని కోరాం. గత 15 రోజులుగా రామోజీరావు, రాధాకృష్ణ, టీడీపీ కలిసి ఓటర్ల
జాబితాలో అక్రమాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ ఏదో చేస్తోందంటూ
నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా?. 59 లక్షల ఓట్లు 2019కి ముందు డబుల్
ఉన్నాయని ఫిర్యాదు చేశామన్నారు. వేర్వేరు నియోజకవర్గాలు, వేర్వేరు రాష్ట్రల్లో
ఒకే వ్యక్తికి అధిక ఓట్లు ఉన్నాయి. అందుకే ఓటరు కార్డుకి ఆధార్‌ని అనుసంధానం
చేయాలని కోరాం. ఒకే మనిషికి 2,3 ఓట్లు ఉన్నాయి. వాటిని సరి చేయాలన్నాము. ఒకే
ఇంట్లో 50 నుండి 1000 వరకు ఓట్లు ఉన్నవాటిని సరి చేయమని కోరాం. ఇవన్నీ
అక్రమాలు 2019 ఓటర్ల జాబితాలోనే ఉన్నాయి. అప్పుడు కూడా ఫిర్యాదు చేశాం. కానీ,
సరిచేయలేదు. విజయవాడ సెంట్రల్లో ఒకే ఇంట్లో 510 ఓట్లు టీడీపీ ప్రభుత్వం
హయాంలో నమోదు చేశారన్నారు.
బండి సంజయ్‌పై పేర్ని నాని సెటైర్లు : తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై
మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ఏపీలో వైసీపీ ఓటర్ల జాబితాలో
అక్రమాలు చేస్తోందన్న సంజయ్ విమర్శలను పేర్ని నాని తప్పు పట్టారు. మంగళవారం
వెలగపూడి సచివాలయం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవి పోయిన వాడు.. పైన ఊడి పోయిన
వాడు ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ వైసీపీని విమర్శిస్తున్నారన్నారు. బండి
సంజయ్‌కు దేవుడు పైన ఊడగొట్టాడని, బీజేపీ కిందున్న ఛైర్ ఊడగొట్టిందని సెటైర్
వేశారు. ఉత్తర భారతంలో బీజేపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తున్నట్టు ఏపీలో
జరుగుతుందనుకున్నారా..? అని పేర్ని నాని ప్రశ్నించారు.