ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున
గుంటూరు : పేదరికాన్నినిర్మూలించాలని మాటల్లో చెప్పడం వేరు, దాన్ని చేతల్లో
చేసి చూపడం వేరు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నవరత్నాలతో పాటుగా ఇతర
పథకాలను అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు నడుం బిగించిందని ఆంధ్రప్రదేశ్
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. ఎన్నో ఆటంకాళ్లు,
సవాళ్లు అడుగడుగునా ఎదురౌతున్నా మొక్కవోని దీక్షతో పేదల అభ్యున్నతికి చేయూతను
అందించింది. మధ్యదళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలను పేదలకు నేరుగా
చేరవేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ద్వారా పేదలను పేదరికం
నుంచి బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
అహరహం శ్రమిస్తోందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అప్రతిహతంగా
కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో సత్ఫలితాలను ఇవ్వడం మొదలు
పెట్టాయి.ఈ నేపథ్యంలోనే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తూ రాష్ట్రంలో పేదరికం
తగ్గుముఖం పట్టడం మొదలైయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలోని పట్టణ,
గ్రామీణ ప్రాంతాల్లోనూ పేదరికం తగ్గిపోతోంది.. ఈ విషయాన్నే నీతి అయోగ్ తన తాజా
నివేదికలో ధృవీకరించిందని మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు.