శాసనమండలి సభ్యులు, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యేవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి
గుంటూరు : మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోన్నతవ్యక్తిత్వం
గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలి సభ్యులు, పార్టీ కేంద్ర
కార్యాలయం పర్యేవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్
సిపి కేంద్ర కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు ఘనంగా
జరిగాయి.ఈ సందర్బంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన
నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ విలక్షణ
వ్యక్తిత్వం కలిగిన రాధాకృష్ణన్ ఉపాధ్యాయునిగా పేరు ప్రఖ్యాతలు పొంది
రాష్ర్టపతి స్దాయికి ఎదగగలిగారన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కాకుండా
సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి వ్యవస్ధ నిర్మాణంలో గురువు పాత్ర
విడదీయరానిదన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువు మన వ్యక్తిత్వ
నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తారని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చూపిన
బాటలో నడుస్తూ విద్యా వ్యవస్దలో వైయస్ జగన్ అనేకసంస్కరణలు అమలు
చేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్ది ప్రపంచస్దాయిలో పోటీ పడే రీతిలో విద్యా
వ్యవస్దను తయారుచేస్తున్న ఘనతవైయస్ జగన్ దన్నారు. కార్యక్రమంలో పార్టీ
విద్యార్ది విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటిచైతన్య, వైయస్సార్ సిపి నేతలు
పాల్గొన్నారు.