వాంతుల సమస్య వస్తుంది. అయితే దీనిని నివారించడంలో కొన్ని రకాల టీలు
ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం..
సోంపు టీ:
సోంపు గింజలతో పాటు సోంపు టీ తాగినా కూడా తిన్న ఆహారం జీర్ణమవుతుంది. దీనివల్ల
వికారం కడుపునొప్పి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
చమోమిలే టీ:
చమోమిలే టీ తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో వికారం
తగ్గించడంతో పాటు వాంతులు, గ్యాస్ వంటి సమస్యలు కూడా అదుపులో ఉండటం కూడా ఒకటి.
అల్లం టీ:
వికారాన్ని తగ్గించడంలో అల్లం టీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే
జీర్ణశక్తిని మెరుగుపర్చి తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది.
అతిమధురం టీ:
అతిమధురంలోని ఔషధ గుణాలు అజీర్ణ వంటి సమస్యను తగ్గించడంతో పాటు వికారాన్ని
నివారిస్తాయి. అల్సర్లను తగ్గించడంలో దోహదపడతాయి.
పెప్పరమింట్ టీ:
పెప్పరమింట్ టీని పుదీనాతో తయారుచేస్తారు. దీనిలోని సమ్మేళనాలు మనసును
ఉల్లాసంగా ఉంచడంతో పాటు కడుపు నొప్పి, వికారాన్ని తగ్గిస్తాయి. అలాగే ఈ టీతో
కండరాలు రిలాక్స్ అవుతాయి.
బ్లాక్ టీ:
జీర్ణ సంబంధ సమస్యల్ని తగ్గించడంలో బ్లాక్ టీ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వికారం నుంచి బయటపడేయడంతో పాటు కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
లెమన్ టీ:
నిమ్మకాయ, తేనె కలిపి తయారు చేసే లెమన్ టీ వల్ల కూడా వికారం తగ్గుతుంది.
దీనిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.
తులసి టీ:
జీర్ణశక్తిని రెట్టింపు చేయడంలో తులసి సహాయపడుతుంది. అలాగే వికారం, వాంతులు,
ఛాతి నొప్పి సమస్యల్ని నివారిస్తుంది. అందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు తులసి టీ
తాగడం మంచిది.