వయస్సుల వారిని వేధిస్తున్న సమస్య తలనొప్పి.. తలనొప్పి రావడానికి గల ప్రధాన
కారణాలు ఏమిటంటే..
ఒత్తిడి:
తలనొప్పి రావడానికి గల ప్రధాన కారణం ఒత్తిడి. శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువ
అయినప్పుడు కండరాల్లో అసౌకర్యం కలుగుతుంది. ఇది తీవ్రం కావడంతో తలనొప్పి
వస్తుంది.
నిద్రలేమి:
నిద్రలేమి అనేది తలనొప్పికి మరో ప్రధాన కారణం. నిద్రలేమి కారణంగా మెదడు
పనితీరు సరిగా ఉండదు. ఇది న్యూరో ట్రాన్స్మిటర్లు పనితీరు, రక్తప్రవాహానికి
ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో తలనొప్పి వస్తుంది.
మితిమీరిన వ్యాయామం:
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిదే కానీ, మితిమీరిన వ్యాయామం చేయడంతో అనేక
సమస్యలు వస్తాయి. ఎక్కువగా వ్యాయమం చేయడంతో రక్తప్రవాహం పెరుగుతుంది.
వాసోడైలేషన్ కారణంగా తొలనొప్పి వస్తుంది.
స్మార్ట్ ఫోన్ :
స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగించడంతో తలనొప్పి పెరుగుతుంది. ఫోన్ ఎక్కువగా
వినియోగించడంతో మెడ నొప్పి సైతం తీవ్రం అవుతుంది. స్మార్ట్ డివైజ్లలోని
బ్లూలైట్ అనేక సమస్యలకు కారణం అవుతుంది.
ఆల్కాహాల్:
ఆల్కాహాల్, కాఫీ, టీలను అధికంగా తీసుకోవడంతో తలనొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువ
అవుతుంది. వీటిని తరుచూ తీసుకోవడంతో శరీరంలో నీటి స్థాయిలు తగ్గుతాయి. ఇది డీ
హైడ్రేషన్ కు కారణం అవుతుంది. కాఫీ, టీలు మితంగా తాగడం మంచిది.
వాతావరణం:
తలనొప్పి సమస్య తీవ్రం అవ్వడానికి మరో ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులు.
ఒక్కసారిగా వాతావరణం మారడంతో తలనొప్పి అధికం అవుతుంది. ఉష్ణోగ్రత, తేమ,
పీడనంలో మార్పుల కారణంగా తలనొప్పి వస్తుంది.
అధిక కాంతి:
అధిక వెలుతురును అందించే లైట్ల కింద ఉండటం కూడా తలనొప్పికి కారణమే. ముఖ్యంగా
లైట్లు మిణుకు మిణుకుమంటున్న సమయంలో మెదడులో తలనొప్పికి కారణమయ్యే రసాయనాలు
విడుదల అవుతాయి. సరైన కళ్లజోడు వినియోగించడంతో తలనొప్పి తగ్గుతుంది.
సుగంధాలు:
చాలా మంది నలుగురిలో ఆకర్షణగా ఉండేందుకు పెర్ఫూమ్ వినియోగిస్తారు. కొందరిలో
సుగంధాల కారణంగా తలనొప్పి వచ్చే అవకాశం చాలా అధికంగా ఉంటుంది.