బ్రిటీష్ కాలంనాటి నేపథ్యంలో సాగే పీరియాడికల్ మూవీ “డెవిల్” ‘బ్రిటీష్
సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ
బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు.
అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ కథానాయిక.
1940నాటి నేపథ్యాన్ని కళ్లకు కట్టేందుకు కోట్లు వెచ్చించి, దాదాపు 80 సెట్లను
ఈ సినిమాకోసం నిర్మిస్తున్నట్టు కళాదర్శకుడు గాంధీ తెలిపారు. దీనికోసం
తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ నుంచి సామాగ్రిని తెప్పించినట్టు ఆయన
చెప్పారు. నిర్మాత అభిషేక్ ఎక్కడా రాజీ పడకుండా ఇష్టంతో ఈ సినిమాను
నిర్మిస్తున్నారని, ఆయన సపోర్ట్ వల్లే ఇన్ని సెట్ల నిర్మాణం సాధ్యమైందని గాంధీ
అన్నారు. 1940 ప్రాంతంలో చెన్నయ్ ఆంధ్రాక్లబ్, 36 అడుగుల ఎత్తున్న లైట్ హౌస్,
బ్రిటీష్ కాలంనాటి కార్గో షిప్, వింటేజ్ కార్లు, ఆనాటి సైకిళ్లు, బ్రిటీష్
కాలంనాటి 500 పుస్తకాలు ఇలా ప్రతి ఒక్కటీ డీటైల్డ్ గా ఈ సినిమాకోసం
తీర్చిదిద్దుతున్నాం. ఇలాంటి సినిమా కళాదర్శకులకు సవాల్. ఇంతమంచి అవకాశం రావడం
నిజంగా నా అదృష్టం అని గాంధీ ఆనందం వ్యక్తం చేశారు. నవంబర్ 24న సినిమాను
విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.