నెల్లూరు : భవిష్యత్తుకు గ్యారంటీ-ఇది చంద్రబాబు ష్యురిటీ కార్యక్రమమంపై
మాజీమంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని
నారాయణ మెడికల్ కాలేజ్ క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష జరిపారు. నగరంలోని
డివిజన్ల వారీగా పబ్లిక్ ఫల్స్ పై నారాయణ ఆరా తీశారు. 45 రోజులపాటు నిర్వహించ
తలపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ-ఇది చంద్రబాబు ష్యురిటీ అంశంపై యువ
కార్యకర్తలతో డిస్కస్ చేశారు. ప్రతి గడపలో చంద్రబాబు పేరు వినపడేలా ప్రచారం
నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జి
పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ
లక్ష్యాలను ప్రజలకు చేరవేసే అంశాలపై యువకార్యకర్తలతో చర్చించమన్నారు. ఒక
ప్రణాళిక ప్రకారం ప్రజలకు చేరువయ్యేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
ప్రతి కార్యకర్త ప్రజల వద్దకెళ్లి టీడీపీ మేనిఫెస్టోకి విస్తృత అవగాహన
కల్పించేలా సూచనలు ఇచ్చామన్నారు. మినీ మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు
చేరవేస్తున్నామని, నెల్లూరు నగరంలో టీడీపీ విజయం తధ్యమని ఆయన ధీమా
వ్యక్తపరిచారు. పాలనలో వైసీపీ విఫలమైందన్న ఆయన ప్రజలు టీడీపీ పట్ల చంద్రబాబు
నాయుడు నాయకత్వం పట్ల నమ్మకంగా ఉన్నారని తెలియజేసారు. ఈసారి వైసీపీ ఎన్ని
ప్రయత్నాలు చేసినా గెలిచే అవకాశాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత
జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు పాటు షేక్ అల్లబక్షు, రాజశేఖర్ రెడ్డి,సునీల్
కుమార్,తానే చందు,అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.