వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
గుంటూరు : ఐటీశాఖ నోటీసులతో చంద్రబాబు చీకటి నిర్వాకాలు వెలుగులోకి వచ్చాయని,
చంద్రబాబు ధన దాహార్తి కోసం నిరుపేదల ఈడబ్ల్యూఎస్ గృహాలను సైతం వదల్లేదని
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు.
సోషల్ మీడియా వేదికగా సోమవారం ఆయన ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు
అమరావతిలో తాత్కాలిక భవనాలకు రూ.118 కోట్లు ముడుపులు అందుకున్నాడని,
తాత్కాళిక భవనాల తరహాలో ప్రజాధనం స్వాహాకు బాబు స్కెచ్ వేశారని అన్నారు. అలాగే
రూ.8000 కోట్ల పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టు షాపూర్జీ పల్లోంజీకి ఇచ్చి
ముడుపులు అందుకున్నారని అన్నారు. దుబాయ్ దినార్ల రూపంలో ముడుపులు అందుకొని
బాబు అడ్డంగా దొరికిపోయాడని అన్నారు.
రాష్ట్రంలో 1500 ఈ-బస్సులు
డీజిల్ బస్సుల స్థానంలో కొత్తగా ఈ-బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందని
ఈ మేరకు కొత్తగా 1500 ఈ-బస్సులు కొనుగోలుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుందని
అన్నారు. రూ.1500 కోట్లతో ప్రాజక్టుకు సంస్థ ఆమోదం తెలిపిందని అన్నారు. జిల్లా
కేంద్రాల మధ్య ఈ-బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఈ-బస్సులతో పర్యావరణ
పరిరక్షణతో పాటు 27% నిర్వహణ వ్యయం తగ్గుతుందని అన్నారు. ఇప్పటికే
తిరుమల-తిరుపతిలో 100 ఈ-బస్సులు ప్రవేశపెట్టిన విషయాన్ని విజయసాయి రెడ్డి
గుర్తుచేశారు.
10బిలియన్ మార్క్ దాటిన డిజిటల్ లావాదేవీలు
డిజిటల్ ఇండియా కల నెలవేరబోతుందని, దేశంలో రికార్డు స్థాయిలో జరిగిన డిజిటల్
లావాదేవీలే ఇందుకు నిదర్శనమని అన్నారు. 2023 ఆగస్టు నాటికి యూపీఐ లావాదేవీల
సంఖ్య 10 బిలియన్లు దాటిందని అన్నారు. 2023 ఆగస్టు నాటికి 10.58 బిలియన్లు
డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు తద్వారా రూ. 15.76 లక్షల కోట్లు నగదు
లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. 2023 జూలై నాటికి
9.96బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు తద్వారా రూ.15.34లక్షల కోట్లు నగదు
లావాదేవీలు జరిగినట్లు తెలిపారు.అలాగే 2023 జూన్ నాటికి 9.34 బిలియన్లు
లావాదేవీలు జరుగగా రూ.14.75 లక్షల కోట్లు నగదు లావాదేవీలు జరిగినట్లు
తెలిపారు. పైన వివరించిన గణాంకాల ప్రకారం దేశంలో డిజిటల్ లావాదేవీలు మరింతగా
పెగుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.