news descriptionనగర పోలీసులు ఆయన్ని గుర్తించకపోయినా జిల్లా కలెక్టర్
గుర్తించిన నేటి గాంధీ పోరాటం
నేటి గాంధీ నాగరాజన్ ఒంటరి పోరాటానికి కాంగ్రెస్ నాయకుల సంఘీభావం
విజయవాడ పశ్చిమ : రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరినొకరు
తిట్టుకొంటూ సభలు సమావేశాలు బల ప్రదర్శన సర్వసాధారణమైన విషయం తెల్సిందే.
ప్రతి రాజకీయ పార్టీల అధినేతల లక్ష్యం ఒక్కటే ముఖ్యమంత్రి కావాలి. కానీ ఎలాంటి
స్వార్ధం లేకుండా దేశంలో మహిళల కోసం..33 శాతం రిజర్వేషన్లు కోసం రాష్ట్రానికి
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నేటి గాంధీ ఆర్ ఆర్ నాగరాజన్ సోమవారం విజయవాడ
ధర్నా చౌక్ లో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఆయన కేంద్ర మంత్రి పదవి కోసం
ప్రయత్నాలు చేయడంలేదు.రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం అడ్డదిడ్డమైన వాగ్దానాలు
చేయడంలేదు. దేశం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇంతకు ముందు మణిపూర్ హరియనా
రాష్ట్రల్లో జరిగిన ఘోరాలపై రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై, ప్రజాస్వామ్య
పరిరక్షణ కోసం గాంధీ దేశం ట్రస్ట్ కార్యాలయం 16 రోజులు పాటుగా ఆమరణ
నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. ఐతే ఈ ఆమరణ నిరాహారదీక్ష లో నగర
పోలీసులు తమపట్ల సానుకూలంగా స్పందించ లేదని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కి
వినతిపత్రం సమర్పించి నేడు చేపట్టిన రిలే నిరసన దీక్షకు ఏకంగా కలెక్టర్ నుండి
అనుమతి పొందడం విశేషం. ఈ దీక్షా శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్ మాహిళ
అధ్యక్షురాలు లాంతాంతియా కుమారి, రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్
షేక్ ఖాజా మొహిద్దీన్, సిటి ఎస్ టి చైర్మన్ రాంచర్ల ప్రకాష్ , మహిళా
కాంగ్రెస్ నాయకురాళ్లు మానిత, వెన్నా మల్లికా రెడ్డి, సి హేమంత్, భూషణం,
తదితరులు పాల్గొని నేటి గాంధీ కి సంఘీభావం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ మహిళా కార్యదర్శి, ప్రముఖ లాయర్ బోయ జయమ్మ
ప్రత్యేకంగా గాంధీ దీక్షకు మద్దతు తెలిపారు.