ఇంజనీరింగ్) కోర్సులకు తరగతులను సోమవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ
సందర్బంగా వర్శిటీ చాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ మాట్లాడుతూ
విధ్యార్ధులు క్రమశిక్షణతో ఏదైనా సాదించవచ్చునని అన్నారు. ఆర్.అండ్ డి హాలులో
ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సుకు బిబిఎ, ఎంబిఎ, బిసిఎ తదితర ప్రథమ సంవత్సరంలో
చేరిన విధ్యార్దులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్బంగా ఆయన
మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని
సూచించారు. ఆధునిక టెక్నాలజీ రంగంలో రాణించాలంటే పట్టుదల, క్రమశిక్షణ
తప్పనిసరిగా అలవరచుకోవాలన్నారు.
వైస్ చాన్సలర్ డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్ మాట్లాడుతూ కెఎల్ విశ్వవిద్యాలయంలో
చదివిన ప్రతీ విద్యార్ధికి ఉద్యోగాన్ని అందించడమే లక్ష్యంగా తమ
విశ్వవిదలయంలోని అధ్యాపకులు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో
విధ్యార్ధులు సాంకేతిక సంస్కృతిని అలవరచుకోవాలని అన్నారు. గత నలబై ఏళ్లుగా
ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సుల విజయ పరంపరతో దూసుకుపోతున్న కెఎల్ డీమ్డ్
విశ్వవిద్యాలయంలో విద్యార్ధులకు రానున్న కాలంలో ప్రపంచానికి అత్యంత
ప్రతిభావంతులైన ఉద్యోగలను అందించడంలో రికార్డు తమ సొంతమని దీమా వ్యక్తం
చేశారు.
రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ మేనేజ్మెంట్ హ్యుమానిటీస్,
సైన్స్ కోర్సులలో ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులను అభినందించారు.
విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో కెఎల్ యు ది ప్రత్యేక శైలి అని
అన్నారు. పిల్లల పట్ల తల్లి దండ్రుల కలలను సాకారం చేయడం కోసం తమ అధ్యాపకులు
నిరంత కృషిని చేస్తున్నారని అన్నారు.
ఎంహెచ్ ఎస్ డీన్ డాక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ కెఎల్ యులో నాన్ ఇంజనీరింగ్
విద్యార్దులకు ఉన్న వసతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రో వైస్
చాన్సలర్లు డాక్టర్ ఎవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, అన్ని విభాగాల
డీన్లు, డైరెక్టర్లు, అన్ని విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.