నెమ్మదిగా హృదయ స్పందన రేటు, కండరాల బలహీనత, జుట్టు పల్చబడటం, నెమ్మదిగా గుండె
కొట్టుకోవడం, కీళ్లలో దృఢత్వం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపోథైరాయిడ్ తో బాధ
పడే వాళ్లు ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.
కావున వీటికి దూరంగా ఉండాలి.
1. క్రూసిఫరస్ కూరగాయలు:
క్రూసిఫరస్ కూరగాయలు అనగా కాలే, బ్రోకలీ, కాలీఫ్లవర్, టర్నిప్, క్యాబేజీ మరియు
బచ్చలికూర వంటి ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యకరమైనవే. అయినప్పటికీ.. థైరాయిడ్
హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలిగించే గోయిట్రోజెన్ లను కలిగి ఉంటాయి. కావున
వీటిని అస్సలు తినకండి.
2. సోయా:
సోయాలో ఈస్ట్రోజెన్ ,ఐసోఫ్లేవోన్ లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ ను
ఉపయోగించుకునే శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి థైరాయిడ్
తక్కువగా ఉన్నవారు సోయాను తినడం మానేయాలి.
3. మిల్లెట్స్:
మిల్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్ అపిజెనిన్, థైరాయిడ్ పెరాక్సిడేస్ థైరాయిడ్
హార్మోన్లోకి అయోడిన్ ను చొప్పించే ఎంజైమ్ కార్యాచరణను తగ్గిస్తుంది. కాబట్టి
మిల్లెట్స్ తినకపోవడమే ఉత్తమం.
4. కెఫిన్:
థైరాయిడ్ కోసం మందులు తీసుకున్న తర్వాత కెఫిన్ తీసుకుంటే అది మందులపై
పనితీరుపై ప్రభావం చూపుతుంది.
5.మద్యం:
ఆల్కహాల్ అనేక విధాలుగా శరీరానికి హాని కలిగిస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోను
ఉత్పత్తి చేసే, గ్రహించే శరీర సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కావున
వీటికి దూరంగ ఉండటం మంచిది.