విజయవాడ : స్థానిక 39వ డివిజన్ లో గల పలు ప్రజా సమస్యల పరిష్కారానికై సోమవారం
మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
అధికారులు నాయకులతో కలసి విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ రోజు 39వ డివిజన్ పలు ప్రాంతాలలో
పర్యటించడం జరిగిందన్నారు. అన్ని విభాగాల అధికారులతో కలిసి విస్తృతంగా
పర్యటించడం జరిగిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యల
పురోగతిని పర్యవేక్షించడానికి డివిజన్ పర్యటించడం జరిగిందన్నారు. జగనన్న
వచ్చాక ఈ డివిజన్ ను అభివృద్ది పరచడం జరిగిందన్నారు.గతంలో అరకొర అభివృద్ది
మాత్రమే జరిగింది నేడు పూర్తిగా అభివృద్ది చేయడం జరిగిందన్నారు. డివిజన్ లో
అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేసమన్నారు.కొంత కాలువల సమస్య ఉంది. దానిని
అధిగమించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏమి అవసరమో అది
అక్కడికక్కడే పరిష్కరిస్తూనట్లు తెలిపారు. గతంలో చంద్రబాబు అమరావతి పేరుతో
విజయవాడ నగర అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. విజయవాడ నిధులను అమరావతికి
మల్లించారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ,
ఏలూరు వెంకన్న,డివి రెడ్డి,బోండా సాంబశివరావు, పదిలం రాజశేఖర్,చిన్ని కోటేశ్వర
రావు, పాశం శివ, జూలూరి నాగభూషణం, సికాకొల్లి బాలాజీ,డివిజన్ పార్టీ నాయకులు,
కార్యకర్తలు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు
సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.