ఇదే రోజున గూగుల్ ఆవిర్భావం జరిగింది. గూగుల్ అనే పదం డిక్షనరీలోకి
అధికారికంగా ప్రవేశించి 17 సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు హార్వర్డ్
విద్యార్థులు డార్మ్‌లో దీనికి రూపకల్పన చేశారు. 4 సెప్టెంబర్ 1998లో లారీ
పేజ్, సెర్గీ బ్రిన్ దీన్ని ప్రారంభించినప్పుడు గూగుల్ కేవలం ఒక శోధన
ఇంజిన్ మాత్రమే. కాలక్రమంలో ఒక్కో మెట్టు పైకెక్కుతూ సామాజిక మాధ్యమాల నుంచి
యూటూబ్ వరకు, అక్కడి నుంచి పేమెంట్ సేవల వరకు విస్తరించింది.
ఇప్పుడ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఏఐ శకానికి బాటలు వేస్తోంది.
గూగుల్ కంపెనీ ఇప్పుడు ఆల్ఫాబెట్ పేరెంట్ గ్రూప్‌లో భాగమయ్యాక టెక్నాలజీ
దిశగా విస్తరించింది. కొన్ని విభాగాల్లో ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తుంది.
ప్రస్తుతం ఏఐ కృత్రిమమేథ రేస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది.
విజయాలు.. వైఫల్యాలు
ఇ-మెయిల్, స్మార్ట్ఫోన్లు, సాప్ట్వేర్, హార్డ్‌వేర్, డ్రైవర్‌లెస్
కార్లు, డిజిటల్ అసిస్టెంట్లు, యూట్యూబ్, వందల కొద్దీ ఉత్పత్తులు, సేవలను
గూగుల్ సృష్టించింది. కానీ అవన్నీ వర్కవుట్ కాలేదు. కిల్డ్ బై గూగుల్
వెబ్సైట్లో 288 రిటైర్డ్ ప్రాజెక్ట్‌లు జాబితా చేయబడ్డాయి. ఇందులో గేమింగ్
ప్లాట్‌ఫారమ్ స్టేడియా, బడ్జెట్ విఆర్ హెడ్సెట్ గూగుల్ కార్బ్‌బోర్డ్
వంటివి ఉన్నాయి. కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో
గూగుల్ తన సర్వవ్యాప్తిని కొనసాగించగలదా అన్నది నేటి ప్రశ్న. అయితే ఈ
ప్రయత్నంలో కొంత వెనక్కు తగ్గిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కృత్రిమ మేథ
ప్రయోగం మొదట్లో చాలామందిని ఆకట్టుకుంది. ఇది నవంబర్ 2022లో చాట్‌జీపీటీ
పేరుతో ప్రపంచానికి పరిచయం అయింది. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల నుంచి
బిలియన్ డాలర్ల పెట్టుబడులను పొందింది. అయితే పేజీల కొద్దీ సమాచారం ఇచ్చే
సెర్చింజన్‌కి బదులుగా, ఒక ప్రశ్నకు ఒకేసారి సమాధానం ఇవ్వడం వల్ల చాట్‌జీపీటీ
గూగుల్ కిల్లర్”గా మారిందన్న అపోహలు తలెత్తాయి. అయితే, అల్ఫాబెట్ తన
గూగుల్ క్లౌడ్ వ్యాపారంతో ఏఐ విప్లవానికి కేంద్రంగా నిలుస్తోంది. భారీ,
చిన్న వ్యాపారాల నుండి మంచి డిమాండ్ ఉన్నందున, మౌలిక సదుపాయాలను, నిల్వను
అప్డేట్ చేయడానికి క్లౌడ్ మంచి ఆదాయ వనరుగా నిలుస్తోంది. అమెజాన్
వెబ్‌సర్వీస్, మైక్రోసాఫ్ట్ అజూర్‌తో పోల్చితే గూగుల్ క్లౌడ్ చిన్నదే
అయినప్పటికీ సమర్థవంతమైనదిగా పేరు తెచ్చుకుంది.
మాంచెస్టర్ సిటీ అసలు పేరు తెలుసుకోవడం నుండి ప్రపంచంలోని అతి చిన్న
పెంగ్విన్ జాతులను గుర్తించడం వరకు, ఎలైట్ మేధావులు సైతం ఒకప్పుడు సమాధానం
చెప్పలేని ప్రశ్నలకు గూగుల్ మాస్టర్‌గా నిలిచింది. ఇంటర్నెట్ ప్రారంభంతో,
లారీ పేజ్, సెర్గీ బ్రిన్ గూగుల్‌ను పరిచయం చేయడం ద్వారా క్విజ్
ప్రపంచాన్ని కూడా మార్చేశారు. గూగుల్ ప్రారంభంతో ఇప్పుడు లైబ్రరీలలో
తిరుగుతూ, ఎన్సైక్లోపీడియాలను కంఠస్థం చేసేరోజులు పోయాయి.