జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
సారవకోటలో పార్టీ కార్యాలయం ప్రారంభం
భారీ ర్యాలీ, పెద్ద ఎత్తున హాజరైన శ్రేణులు
సారవకోట : ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ
అధికారంలో వస్తుందని జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన
కృష్ణ దాస్ అన్నారు. చంద్రబాబుకు పొత్తులు లేకుండా పోటీ చేసే ధైర్యం ఉందా? అని
ప్రశ్నించారు. సారవకోట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్థానిక పార్టీ
కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీగా హాజరైన పార్టీ శ్రేణులను
ఉద్దేశించి మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలనీ, తమ
ప్రభుత్వం వలన మేలు. న్యాయం జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని కోరారు. రానున్న
8 నెలల్లో వచ్చే ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని, పార్టీని స్థానికంగా మరింత
బలోపేతం చేయడం కోసమే స్థానిక కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
అపోహలు విడనాడాలని,
ప్రతి కార్యకర్త కష్టానికి తగిన ఫలితమే జిల్లాలో తనకు అత్యధిక మెజార్టీ
రావడానికి కారణమని, దాదాపు 20 వేల మెజార్టీ సాధించడం మామూలు విషయం కాదని
చెప్పారు. అందరి పట్ల ప్రేమ, కృతజ్ఞత భావం ఉండటం వల్లనే తనకీ స్థాయి వచ్చిందని
చెప్పారు. ప్రజలకు చేరువగా ఉండాలనే ఉద్దేశంతో సారవకోట మండల కేంద్రంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
స్థానిక నాయకత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు . శ్రీకాకుళం జిల్లా
పై ఎనలేని ప్రేమ అటు వైయస్సార్ కు, ఇటు జగన్మోహన్ రెడ్డికి ఉందని ఎన్నో
విషయాల్లో స్పష్టం అయిందని చెప్పారు. ఒక స్పీకర్, రెండు మంత్రి పదవులు ఏడు
కార్పోరేషన్ చైర్మన్లు పదవులు ఒక్క శ్రీకాకుళం జిల్లాకే దక్కడం ఎంతో గౌరవం
అన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలను గెలిపించి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మద్దతు పలకాలని కృష్ణ దాస్
పిలుపునిచ్చారు. సారవకోట మెయిన్ రోడ్డులోని విశాలమైన కళ్యాణ మండపాన్ని లీజుకు
తీసుకొని ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని తొలుత ధర్మాన కృష్ణ దాస్
ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పలువురు టిడిపి నుంచి వైఎస్ఆర్సిపి లో చేరిన వారికి ఈ సందర్భంగా కండువాలు
కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ధర్మాన
పద్మప్రియ, ధర్మాన రాందాస్, ధర్మాన రామలింగం నాయుడు, వరదు వంశీకృష్ణ, వరదు
దేవి ప్రసాద్, నక్క తులసీదాస్, తులసి మాస్టారు, బాడాన కృష్ణారావు, యాళ్ళ
శ్యాంసుందర్రావు, గుణుపూరు రామారావు, కోరుకొండ శంకర్ బాబు, పల్లి కృష్ణారావు,
చిన్నాల లక్ష్మీనారాయణ నాయుడు, గల్లంకి వెంకటరావు, రావాడ భాస్కరరావు, నిక్కు
రాజశేఖర్, కింజరాపు ధర్మారావు, యడ్ల అసురయ్య, మెండా సన్యాసిరావు తదితరులు
పాల్గొన్నారు.
భారీ ర్యాలీ : పెద్ద ఎత్తున హాజరైన పార్టీ శ్రేణులు
సారవకోటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా నియోజక వర్గ ముఖ్య
నేతల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నరసన్నపేట జమ్ము కూడలి
నుంచి సారవకోట వరకూ 100 కు పైగా కార్లు, 200కు మించి బైక్ లతో జరిగిన ర్యాలీలో
పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు. జై జగన్ జై దాసన్న నినాదాలతో ప్రధాన
రహదారి హోరెత్తింది. నరసన్నపేట, పోలాకి పార్టీ శ్రేణులు జమ్మూ కూడలి వద్ద
పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కు ఘన స్వాగతం పలకగా అక్కడ నుంచి
20 కిమి పాటు సాగిన ర్యాలీకి చల్లపేట వద్ద జలుమూరు మండల నేతలు గజమాలలతో
సత్కరించి స్వాగతించారు. అక్కడ నుంచి సారవకోట చేరుకున్న తర్వాత తొలుత వైయస్
రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అక్కడ నుంచి
కాలి నడకన వందలాది మంది శ్రేణులతో ర్యాలీగా వెళ్లారు. అనంతరం సారవకోట మండల
కేంద్రంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి
ర్యాలీగా వెళ్లి నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ర్యాలీలో
డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ధర్మాన రాందాస్, కోరాడ చంద్రభూషణ్
గుప్తా, వాన గోపి, ముద్దాడ బైరాగి నాయుడు, చింతు రామారావు, చీపురు
కృష్ణమూర్తి, రాజాపు అప్పన్న, పంగ బావాజీ నాయుడు, పతివాడ గిరీశ్వరరావు, కణతి
కృష్ణారావు, దాలి నాయుడు, బూరెళ్లశంకర్, కణసు సీతారాం, తంగి మురళీకృష్ణ,
ముద్దాడ బాల భూపాల్ నాయుడు,పాగోటి రాజారావు, బొబ్బది ఈశ్వరరావు, కోటిపల్లి
శ్రీనివాసరావు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.