పరిశీలించేందుకు 8 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్
కోవింద్ నేతృత్వంలోని కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు శాసన, న్యాయ,
ఆర్థిక నిపుణులకు చోటు కల్పించింది.
‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్
కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం మొత్తం 8 మంది సభ్యులను
నియమించింది. అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు
చోటు కల్పించింది. సార్వత్రిక ఎన్నికలు ముందే జరుగుతాయనే ఊహాగానాలు మధ్య
కేంద్రం చర్యలు మరింత ఆసక్తి కనబరుస్తున్నాయి.ఈ కమిటీకి ఛైర్మన్గా మాజీ
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమితులయ్యారు. కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్
షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదురి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ
ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్
డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్
విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు.
తిరస్కరించిన అధీర్ రంజన్ : అయితే ఈ కమిటీలో సభ్యుడిగా తనకు అందిన ఆహ్వానాన్ని
కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదురి తిరస్కరించారు. దీనిపై తనకు ఏలాంటి సంకోచం
లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ కమిటీ వెంటనే పని ప్రారంభించి వీలైనంత త్వరగా సిఫార్సులు చేయనుంది. ఈ కమిటీ
సమావేశాలకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా
హాజరుకానున్నారు. ఇక న్యాయశాఖ కార్యదర్శి నితేన్ చంద్ర.. ఈ కమిటీకి సెక్రటరీగా
వ్యవహరిస్తారు. ఈ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ప్రజాప్రతినిధుల చట్టంతో
పాటు ఇంకా ఏఏ చట్టాలు, నిబంధనలను సవరించాలో అనే అంశాలను పరిశీలించి సిఫారసు
చేస్తుంది. దీంతో పాటు ఈ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరమో లేదో అన్న విషయం కూడా
తేల్చనుంది. ఇక, హంగ్ ఏర్పడినప్పుడు, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపులు వంటి
పరిస్థితులు ఏర్పడినప్పుడు అవసరమయ్యే పరిష్కారాలను కూడా కమిటీ విశ్లేషించి
సిఫారసు చేయనుంది. లా కమిషన్ 170వ నివేదిక, 2015 డిసెంబరులో ప్రజా వినతులు,
న్యాయ విభాగపు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ నివేదిక ఒకే దేశం, ఒకే
ఎన్నికను సిఫారసు చేశాయని కేంద్ర న్యాయశాఖ తన ఆదేశాల్లో తెలిపింది. ఈ సిఫారసుల
మేరకు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి
ఎన్నికలు నిర్వహించే అంశంపై ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ నిబంధనలు మేరకు అధ్యయనం
చేయాలని పేర్కొంది.