విజయవాడ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు దిగ్విజయ్
సింగ్‌తో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు శనివారం హైదరాబాద్‌లో మర్యాద
పూర్వకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్
రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు,
ఎన్.రఘువీరారెడ్డి సంయుక్తంగా రచించిన రైతే రాజైతే పుస్తకం ఆవిష్కరణ
కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన ఆయనతో గిడుగు రుద్రరాజు పలు విషయాలను
చర్చించారు. వీరి భేటీలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు చర్చకు
వచ్చాయి. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులను
గిడుగు రుద్రరాజు ప్రత్యేకంగా వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని
బలోపేతం చేయడానికి చేపట్టిన అనేక చర్యలను కూడా గిడుగు రుద్రరాజు ఈ సందర్భంగా
దిగ్విజయ్ సింగ్‌కి వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు
రేవంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంజన్‌కుమార్ యాదవ్, పలువురు నేతలు
పాల్గొన్నారు.