“ఉద్యోగాల సంబరం”కు విశేష స్పందన
ప్రభుత్వ చర్యలపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం
అమరావతి : నిరుద్యోగుల ఆశలు చిగురించేలా యువత భవితకు ధీమా కలిగేలా..రామచంద్ర
యాదవ్ లక్ష్యం నెరవేరేలా భారత చైతన్య యువజన పార్టీ నిర్వహించిన “ఉద్యోగాల
సంబరం” విరబూసింది. వేలాది మంది యువత తమ కలలను సాకారం చేసుకున్నారు.
నిరుద్యోగులు తమ లక్ష్యం సాధించారు. భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ
ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగాల సంబరం (మెగా జాబ్ మేళా)కు విశేష స్పందన
లభిస్తొంది. రెండు రోజుల పాటు నిర్వహించే మెగా జాబ్ మేళాను మంగళగిరిలోని హాపీ
రిసార్ట్స్ లో ఇవేళ బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడె రామచంద్ర యాదవ్
ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే రిజిస్ట్రేషన్ లు చేయించుకున్న
వేలాది మంది యువతీ యువకులు ఈ మెగా జాబ్ మేళాకు హజరైయ్యారు. ఇప్పటి వరకూ జాబ్
మేళాలో 78 వేల ప్లేస్ మెంట్లతో 504 కంపెనీలు వచ్చాయని, రేపు కూడా మరి కొన్ని
కంపెనీలు వస్తాయని చెప్పారు రామచంద్ర యాదవ్. తొలి రోజు 50 వేల మంది వరకూ
అభ్యర్ధులు హజరు కాగా కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారని చెప్పారు.
ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరించాల్సి పోగా నీచ కార్యక్రమాలకు
పాల్పడ్డారని ఆరోపించారు. కొంత మంది పోలీసులు జాబ్ మేళాకు సంబంధించి
బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించారని అంతే కాకుండా ఇంటర్వ్యూల వద్ద అభ్యర్ధులకు
ఇబ్బందులు కల్గించేందుకు క్యూఆర్ కోడ్ లను చింపేశారని ఆరోపించారు.
జామర్లు పెట్టీ ఆటంకాలు సృష్టించారు
హాపీ రిసార్ట్స్ ప్రాంతంలో ఇంటర్వ్యూలు భంగం కల్గించేందుకు ఇంటర్నెట్
సర్వీసులు పని చేయకుండా జామర్లు ఉపయోగించారని ప్రతి ఒక్కరూ గమనించారని
రామచంద్ర యాదవ్ అన్నారు. ఈ ప్రాంతంలో మెబైల్ నెట్ వర్క్ లు పని చేయకుండా ఈ
కార్యక్రమాన్ని ఇబ్బందులు పెట్టేలా చేశారని మండిపడ్డారు. దీని వల్ల ఐటీ
సెక్టార్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల కు అభ్యర్ధులు ఇబ్బంది పడ్డారనీ, అయితే
అభ్యర్ధుల బయోడేటాను మాన్యూవల్ గా కలెక్ట్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా
కార్యక్రమం పూర్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఇటువంటి మంచి
కార్యక్రమాలకు సపోర్ట్ చేయకపోగా ఇబ్బందులకు గురి చేయడం చాలా దారుణమన్నారు.
ఇలాంటి కార్యక్రమాలకు తలొగ్గి వెనుకడుగు వేసే ప్రశక్తిలేదని చెప్పారు. ఈ వేళ
జరిగిన చిన్న చిన్న లోటుపాట్లను గమనించి వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా
రేపు చేస్తామని చెప్పారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా పూర్తిగా కార్యక్రమంలో
హజరువుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు మంచి ఉద్యోగాలు లభించే విధంగా చర్యలు
తీసుకుంటున్నామన్నారు. ఇవేళ సమస్యను అధిగమించేందుకు రేపు ఇంటర్వ్యూల సమయానికి
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు రామచంద్ర యాదవ్. ఇంటర్నెట్ పని
చేయకపోవడం వల్ల సర్వర్లు కనెక్ట్ కాక ఐటీ సెక్టార్ జాబ్ మేళాలో ఇబ్బందులు
తలెత్తాయన్నారు.
రాబోయే రోజుల్లోనే ఇలాంటి జాబ్ మేళాలు తమ వంతు కృషిగా నిర్వహిస్తామని
చెప్పారు. ఈ జాబ్ మేళాలో అవకాశాలు లభించని వారికి కూడా తర్వాత వారి అర్హతల
ఆధారంగా జాబ్ లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని
నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు బీసీవై పార్టీ ఎల్లప్పుడూ
కృషి చేస్తుందన్నారు. రేపు సాయంత్రానికి ఎంత మందికి ప్లేస్ మెంట్ లు
వచ్చాయనేది తెలియజేస్తామని చెప్పారు.
వేలాది మందికి అన్ని వసతులు
ఇది పెద్ద మహత్తర కార్యక్రమం. వేలాది మంది ఒకే చోటకు ఉద్యోగాల కోసం వచ్చారు..
వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా తాగునీరు, వసతి, భోజనం సహా
అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ఆద్యంతం అధినేత రామచంద్ర యాదవ్ దగ్గరుండి
పర్యవేక్షించారు.. వచ్చిన ప్రతీ ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేశారు.