శ్రీకాకుళం : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకాకుళం జిల్లాపై చెరగని ముద్ర
వేశారని, మన జిల్లా ప్రజల గుండెల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారని,
మనసుతో పాలన చేసిన ఆ మహానాయకుడికి జన్మజన్మల జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైఎస్ 14వ
వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి
కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడే వైఎస్ చిత్రపటానికి, అక్కడ నుంచి ఏడు
రోడ్ల కూడలిలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాలులర్పించారు.
వంశధార ప్రాజెక్టు, ఆఫ్షోర్ రిజర్వాయర్, రిమ్స్, అంబేద్కర్ యూనివర్శిటీ,
కరకట్టలు ఇలా ఎన్నో విశిష్టమైన పనులు వైఎస్ హాయంలో జరిగినవేనని గుర్తు
చేసుకున్నారు. అందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని ఎల్లప్పుడూ కోరుకునే వ్యక్తి
వైఎస్సార్ అని, ఆయన మరణంతో వందలాది మంది గుండె పగిలి ప్రాణాలొదిలారని
చెప్పారు. వైఎస్ ఆశయ సాధన కోసం సీఎం జగన్మోహన్రెడ్డి నిరంతరం తపిస్తుంటారని,
ప్రజలు ఇప్పటికే ఏది మంచి చేసే ప్రభుత్వమో గుర్తించారని, జగన్మోహన్రెడ్డిని
గుండెల్లో పెట్టుకుంటున్నారని కృష్ణదాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ
కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, డీసీసీబీ ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు,
ఎంవి.పద్మావతి, అందవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్, ధానేటి శ్రీధర్, పొన్నాడ
రుషి, రౌతు శంకరరావు, చల్లా అలివేలు మంగ, ఎంవీ స్వరూప్, సుగుణా రెడ్డి, గుంట
జ్యోతి, డిఎస్కె.ప్రసాద్, రత్నాల నర్శింహమూర్తి, మహ్మద్ సిరాజుద్దీన్,
ఎంఎ.బేగ్, రాజాపు అప్పన్న, బొబ్బాది ఈశ్వరరావు, పైడి చందు, బెండి శ్రీను,
కోటిపల్లి శ్రీనివాసరావు, తేజ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వరం
వర్ధంతి సందర్భంగా ఏడు రోడ్ల కూడలిలో వరం విగ్రహానికి కృష్ణదాస్ పూలమాలలు
వేసి నివాళులర్పించారు.
నరసన్నపేటలో : వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నరసన్నపేట నియోజవర్గంలో సీనియర్
శాసననసభ్యులు కృష్ణదాస్ పలుచోట్ల వైఎస్ విగ్రహాలకు స్థానిక నేతలతో కలసి
పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తొలుత పొలాకి మండలం ఈదలవలసలో, అనంతరం
సుసరాం గ్రామంలో, అక్కడ నుంచి నరసన్నపేట వైయస్సార్ కూడలి వద్ద, అక్కడ నంచి
మడపాం వెళ్లి అక్కడే పునర్నిర్మించిన వైస్ విగ్రహానికి పూలమాలలు వేసి
నివాళుర్పించారు. ఆయా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు,
పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.