ఆరోగ్యానికి మేలు చేసే గింజలలో అవిసె గింజలు కూడా ఒకటి. మరి వీటిని తినడం వల్ల
కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
1.అధిక బరువు తగ్గించడంలో అవిసెలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్
తొందరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఉదయాన్నే అల్పాహారానికి బదులు ఒక
గ్లాసు వేడినీళ్లలో ఒక చెంచా అవిసె గింజల పొడిని కలుపుకుని తాగడం వల్ల
ప్రయోజనం ఉంటుంది.
2.మాంసాహారం తినని వారు అవిసె గింజలు తీసుకోవచ్చు. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ
యాసిడ్లు ఉంటాయి. అంతే కాకుండా విటమిన్ డి కూడా దొరుకుతుంది.
3.క్యాన్సర్ నీ అదుపు చేసే లిగ్నాన్స్ మిగతా ఆహారంలో కంటే అవిసెల్లో ఎక్కువగా
ఉంటాయి. వీటిల్లో ఈస్ట్రోజెన్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అవి
ఆడవారిలో వచ్చే రొమ్ము క్యాన్సర్, గర్భసంచిలో వచ్చే కణతుల్ని నిరోధిస్తాయని
అధ్యయనాల్లో తేలింది.
4.రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచడానికి అవిసెలు బాగా పనిచేస్తాయి. ఈ గింజల్ని
కొన్ని నెలలపాటు తినడం వల్ల అవి క్రమంగా అదుపులోకి వస్తాయి.
5.కొంతమందికి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా పెరుగుతాయి.
కొన్నిసార్లు ఎలాంటి మందులు కూడా ప్రభావం చూపలేకపోవచ్చు. ఈ సమస్యకి
అవిసెగింజలు మంచి ఔషధం లాగా పనిచేసి కొలెస్ట్రాల్ స్థాయులనీ అదుపులో ఉంచుతాయి.
6.చాలామందికి హర్మోన్లలో అసమతుల్యత ఉంటుంది. దీని కారణంగా కళ్లు తిరగడం,
ఒత్తిడి, అలసట లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. అవిసెల్లో ఉండే ఈస్ట్రోజెన్ వాటిని
బ్యాలెన్స్ చేస్తుంది.
7.అవిసెల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్
పెట్టేయొచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నా తగ్గిపోతుంది.
8.గర్భిణులు, పాలిచ్చే తల్లులు వీటికి దూరంగా ఉండాలి. దీంట్లో అధికంగా ఉండే
ఈస్ట్రోజెన్ వల్ల శిశువులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి.
9.వీటిని పొడిరూపంలో అయినా, వేయించుకొని నేరుగా అయినా తీసుకోవచ్చు. రోజుకి
ఒకటి నుంచి ఒకటిన్నర స్పూను వరకే తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకుంటే
ఇతరత్రా అనారోగ్య సమస్యలొస్తాయి.