గుంటూరు : గుంటూరు జిల్లా నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజక
వర్గం కొలకలూరు గ్రామం లో జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో
జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు
దగ్గుబాటి పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వారు
ఒక కలశం తీసుకుని వెళ్లి ప్రతి ఇంటి నుంచి కొంచెం మట్టిని సేకరించారు. ఈ
సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ
ప్రధాని నరేంద్ర మోడీ ఏక్ భారత శ్రేష్టభారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ
గ్రామంలో ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్నాం. ఇదేవిధంగా దేశంలోని అన్ని గ్రామాల
నుంచి ఈ విధంగా మట్టిని సేకరించి ఈ మట్టి మొత్తాన్ని దేశ రాజధాని ఢిల్లీలో
ఒకచోట ఉంచి అమృత్వనం పేరుతో అక్కడ మొక్కలు నాటి ఒక వనాన్ని పెంచడం
జరుగుతుందన్నారు. దీని భావం ఆ వనంలో దేశంలోని అన్ని చోట్ల నుంచి వచ్చిన మట్టి
చేస్తుంది అనగా భారత దేశంలో ప్రతి ఒక్క ఇంటి యొక్క భాగస్వామ్యం అక్కడ ఉంటుంది.
తద్వారా కులం మతం ప్రాంతం అనే భేదాలు లేకుండా మనందరం ఒకటి అనే భావం కోసం ఈ
కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు,
పారిశ్రామిక వేత్త బిజెపి నేత తులసి రామచంద్ర ప్రభు, బిజెపి నేతలు జయప్రకాష్
నారాయణ సాదినేని యామిని మాగంటి సుధాకర్ యాదవ్ మైల హరికృష్ణ బీజేవైఎం రాష్ట్ర
అధ్యక్షులు వంశీ వనమా నరేంద్ర భాస్కర్ కాల్ శెట్టి భవనారాయణ కాల్ శెట్టి రమేష్
మంచాల రత్నరాజు నన్నపనేని హరీష్ తదితరులు పాల్గొన్నారు.

దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్
ఒకే దేశం ఒకే ఎన్నికపై విధి విధానాలను రూపొందించేందుకు రామ్నాథ్ కోవింద్ జీ
నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయం స్వాగతించ దగినది.
వివిధ స్థాయిలలో తరచుగా జరిగే ఎన్నికల కంటే ప్రభుత్వం పాలనపై దృష్టి సారించడం
ఈ సమయం యొక్క అవసరం. ఎన్నికల ఖర్చును తగ్గించడంలో మరియు పరిపాలనా మరియు
భద్రతా దళాలపై భారాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ చొరవ మనం ఒక దేశం
అనే నమ్మకానికి మద్దతు ఇస్తుందన్నారు.