పోషకాలు లభిస్తాయి. క్యాప్సకమ్ తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
1.యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలుంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో వర్షాకాలంలో
వచ్చే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
2.అప్పుడప్పుడూ తిన్నా జీర్ణ సంబంధ సమస్యలేవీ రావు. గ్యాస్ సమస్యను పూర్తిగా
తగ్గిస్తుంది.
3.మూత్ర సంబంధ సమస్యలు, ఇన్ఫెక్షన్లు కూడా పోతాయి. కిడ్నీలో రాళ్లున్నా
కరిగించే లక్షణం దీనికుంది.
4.క్యాప్సికమ్ గర్భాశయ, ప్రోస్టేట్ క్యాన్సర్ల నివారణకు దోహదపడుతుంది. మహిళలకు
బాగా మేలు చేస్తుంది. ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.
5.చర్మం నిగారింపునకే కాదు చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. వృద్ధాప్య ఛాయలు
రాకుండా చేస్తుంది. తెల్లమచ్చలు అవకుండా కాపాడుతుంది.
6.విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో రోగనిరోధకత సాధ్యం అవుతుంది. వయసు పెరిగే
కొద్ది ఇబ్బంది పెట్టే కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
7.క్యాప్సికంలో లైకోపిన్, పోటాషియం వయసు పెరుగుతున్న కొద్ది వచ్చే జబ్బులను
తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటితో ఎముకల సాంద్రత పెరుగుతుంది.
8.గుండె ఆరోగ్యాన్ని పెంచే గుణం క్యాప్సికంలో ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్త నాళాల్లో పూడికలు రాకుండా చేస్తుంది.
9.తరచుగా ఆహారంలో భాగం చేసుకోవడంతో అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో
హిమోగ్లోబిన్ పెరుగుతుంది.