కొవ్వూరు : అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, వర్గ, పార్టీలు, రాజకీయాలకు
అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి
విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 130వ రోజు పర్యటన కొవ్వూరు పట్టణం 13వ వార్డులో
అవంతి ఆసుపత్రి నుంచి ప్రారంభమై సొసైటీ మీదుగా, పాత పోస్ట్ ఆఫీస్ వీధి కొత్త
పోస్ట్ ఆఫీస్ వీధి, వంకాయల వారి వీధి మీదుగా కొనసాగింది. చిన్నారులు, మహిళలు,
వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి
ఇంటికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమాన్ని లెక్కలతో సహా కుటుంబ సభ్యులకు
వివరించారు. కార్యక్రమానికి ముందుగా డబ్బులతో, బాణా సంచాతో హోం మంత్రికి ఘన
స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్
రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను అమలు రాష్ట్రంలో
పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారన్నారు. చెప్పినవే కాకుండా చెప్పని హామీలను
కూడా చేసి చూపిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. అందుకే ప్రజలందరూ
ముఖ్యమంత్రికి జననీరాజనం పలుకుతున్నారన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని
వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం
రూపొందించారని ఆమె తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని
సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు. ఈ
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులు నాయకులు,
కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.