వెళ్లారు. సెప్టెంబర్ 2వ తేదీన అట్లాంటాలో జరిగే అమెరికన్ ప్రొగ్రెసివ్
తెలుగు అసోషియేషన్ 15వ వార్షికోత్సవంలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అమెరికాకు
బయలుదేరి వెళ్లారు. ఈ రోజు తెల్లవారుజామున యూఎస్ వెళ్లిన ఆయన పది రోజుల పాటు
అక్కడ పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన అట్లాంటాలో జరిగే అమెరికన్
ప్రొగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ 15వ వార్షికోత్సవంలో బండి సంజయ్
ప్రసంగించనున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ సహా
పలు రాష్ట్రాల్లో అయన పర్యటన ఖరారయింది. ఈ సందర్భంగా పలు ఎన్ఆర్ఐ సంఘాలతో
బండి సంజయ్ సమావేశమవుతారు. యూఎస్ సందర్శన నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్
స్క్వేర్ బిల్ బోర్డుపై సంజయ్ నిలిచారు.
సైకిలెక్కిన బండి..పిల్లలతో సరదాగా ముచ్చట్లు
అమెరికా పర్యటనకు ముందు కరీంనగర్ నగరంలోని పలువురు ముస్లిం సోదరులు బండి
సంజయ్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోదరభావ అనుబంధానికి
చిహ్నంగా నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. మనమిద్దరం. ధర్మానికి,
సమాజానికి, దేశానికి రక్షా అనే ఆలోచనతో జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి అని
బండి సంజయ్ పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
తెలిపారు. పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్న
హిందువులందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.