న్యూఢిల్లీ : రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా జయావర్మ సిన్హా ను
కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆమె నియామకానికి ‘కేబినెట్ నియామకాల కమిటీ
ఆమోద ముద్ర వేసింది. ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జయావర్మనే
కావడం విశేషం. ఇండియన్ రైల్వే మేనేజిమెంట్ సర్వీసెస్ అధికారిణి అయిన
జయావర్మ.. ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యురాలిగా (ఆపరేషన్స్ అండ్ బిజినెస్
డెవలప్మెంట్) ఉన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు లేదా తదుపరి
ఆదేశాలు వచ్చే వరకు సీఈవో బాధ్యతల్లో కొనసాగనున్నారు. నేటి వరకు రైల్వే బోర్డు
సీఈవోగా అనిల్ కుమార్ లాహోటీ కొనసాగారు.
సుప్రీం కోర్టు పేరుతో నకిలీ వెబ్సైట్.. జాగ్రత్తగా ఉండాలని సీజేఐ హెచ్చరిక
అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జయావర్మ.. 1988లో ఇండియన్
రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో చేరారు. ఉత్తర, ఆగ్నేయ, తూర్పు రైల్వే జోన్లలో
ఆయా హోదాల్లో విధులు నిర్వహించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత
హైకమిషన్‌లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్లపాటు పనిచేశారు. ఆ సమయంలోనే కోల్‌కతా
నుంచి ఢాకాకు ‘మైత్రీ ఎక్స్‌ప్రెస్’ ప్రారంభమైంది. జూన్‌లో ఒడిశాలో
చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని
వివరించడం ద్వారా జయావర్మ మీడియాలో నిలిచారు. వాస్తవానికి ఆమె అక్టోబర్ 1న
పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ఆమె పదవీ కాలం ముగిసే వరకు అదే రోజు తిరిగి
ఉద్యోగంలో చేరనున్నారు.