చిత్తూరు : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సినిమాటోగ్రఫీ, వెనుక బడిన తరగతుల
శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గురువారం కుటుంబ సమేతంగా
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించు కున్నారు. శ్రీవారి
దర్శనార్థం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
స్వామివారి దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలతో మంత్రి
తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి చిత్ర పటాన్ని ఆలయ అధికారులు
మంత్రి కి అందజేశారు. మంత్రి వెంట కాణిపాకం ఎ ఈ ఓ కృష్ణారెడ్డి, సూపరిండెంట్
రంగస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రబ్బానీ భాష,
తహసీల్దార్ సుశీల,ఇతర అధికారులు పాల్గొన్నారు.