అల్పుల విమర్శలు నేను అస్సలు పట్టించుకోను
నేను ఎప్పుడూ పేదల పక్షమే
డిగ్రీ కళాశాల ప్రారంభం చేసుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ : బాల్కొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన డిగ్రీ కళాశాలను బుధవారం
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి
చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా
విద్యార్థులకు, బాల్కొండ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు
బాల్కొండ గ్రామంలో ప్రజలు,బిఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీతో మంత్రికి అఖండ
స్వాగతం పలికారు. తమ ప్రాంత చిరకాల కోరిక నెరవేర్చిన మంత్రికి వారు కృతఙ్ఞతలు
తెలియజేశారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. బాల్కొండ కు డిగ్రీ
కళాశాల రావడం,ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడం తనకు ఎంతో సంతోషం
కలిగిస్తోందని అన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి
సహకారంతో ఈ సంవత్సరం నుండే అడ్మిషన్లు ప్రారంభించికున్నమని అన్నారు.
1.ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం,2.ప్యాకేజీ 21, 3.భీంగల్ 100పడకల
హాస్పిటల్,4.బాల్కొండ డిగ్రీ కాలేజీ, 5.కమ్మర్పల్లి, వేల్పూర్ జూనియర్ కళాశాల
ఏర్పాటుకు టార్గెట్ పెట్టుకొని మరి సాధించానని అన్నారు. ఎన్నికలో ఇచ్చిన హామీ
నెరవేర్చిన తృప్తి మిగిలిందన్నారు. నేను ఎప్పుడూ పేద వాళ్ల దిక్కే ఉంటానని
మంత్రి స్పష్టం చేశారు. తన కుటుంబానికి 100 ఎకరాల భూమి15మంది పాలేర్లు
ఉండేవారని గుర్తు చేశారు. అయినా కూడా తాను వేల్పూర్ ప్రభుత్వ స్కూల్ లో
చదువుకున్ననని,ఎస్సీ,బిసి సంక్షేమ హస్టల్ లో తనకు దోస్తులు ఎక్కువ ఉండేవారని,
భోజనం కూడా వారితో హాస్టల్లోనే చేసేవాన్నని,తనకు ప్రొఫెసర్ లింబాద్రి సీనియర్
అని,వారితోనే ఎక్కువ గడిపేవాన్నని అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు. డబ్బుతో
దేన్నీ కొనలేమని, లింబాద్రి విద్యనే నమ్ముకుని నేడు ఉన్నత విద్యా మండలి
చైర్మన్ అయ్యాయని కొనియాడారు.
యువత అందరు ప్రొఫెసర్ లింబాద్రీ ఆదర్శంగా తీసుకోవాలి. విద్యను మించిన
సంపదలేదని,శాశ్వతం అనేది విద్య. నాలెడ్జ్ మాత్రమే అని అన్నారు. మంచి విద్య
సమాజానికి ఎంతో మంచిది. ఎంతో మంది ఉన్నతులను తయారు చేస్తుందన్నారు. తను కూడా
సివిల్ ఇంజనీర్ ను కాబట్టే కేసిఆర్ గారు రోడ్లు భవనాలు శాఖ ఇచ్చారని
సెక్రటేరియట్,అమరవీరుల స్థూపం,125 అడుగుల అంబేద్కర్ విగ్రహం,
కలెక్టరేట్లు,సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లు నిర్మాణంలో కేసిఆర్ గారి ఆదేశాల
మేరకు భాగస్వామ్యం కావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అన్నారు. ఇతర
పార్టీలకు రాజకీయం అంటే గేమ్ అని కేసిఆర్ కు నాకు మాత్రం ఒక టాస్క్ అన్నారు.
రాజకీయాలు ఎవ్వరికీ శాశ్వతం కాదు ప్రశాంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండు అనేది
ముఖ్యం అని అన్నారు. కొంతమంది ఎంతో అల్పంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు
కాలేజి అంటున్నారు. ఎన్నికల తరువాత డిగ్రీ కాలేజీ పోతదా..? అంత కుంచిత
మనస్తత్వంతో రాజకీయాలు చేసేవారిని అసలు పట్టించుకోనని అన్నారు. నా మీద ఎంత
ఎక్కువ ఆరోపణలు చేస్తే, అంత ఎక్కువ అభివృద్ధి పనులు చేస్తా. వారికే
నష్టమన్నరు. నోటిఫికేషన్ రేపు అనే వరకు కూడా బాల్కొండ నియోజకవర్గంకు అభివృధ్ది
నిధులు తెస్తా అని ప్రతిన బూనారు. ఈ డిగ్రీ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం
చేసుకొని ప్రయోజకులు కావాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా
మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు,
కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.