విజయవాడ పశ్చిమ : స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ
శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట్లో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా
జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ
మేయర్లు బెల్లం దుర్గ అవుతు శైలజ రెడ్డి, తదితర మహిళ కార్పొరేటర్లు
వెల్లంపల్లి ఇంటికి విచ్చేసి సోదర భావంతో రాఖీ కట్టి వెలంపల్లి ఆశీస్సులు
తీసుకున్నారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ రాజకీయాలలో అందరం అన్నా
చెల్లెలుగా సోదర భావంతో కలిసి మెలిసి మెలుగుతున్నామని తెలిపారు. రాఖీ పౌర్ణమి
సందర్భంగా యావత్తు అక్కా చెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల , కార్పొరేటర్లు
మైలవరపు రత్నకుమారి,మైలవరపు మాధురి లావణ్య, గోదావరి గంగా,నృత్య అకాడమీ
డైరెక్టర్ బట్టిపటి సంధ్యారాణి, బంక విజయ, బంక చాముండేశ్వరి,తదితరులు
పాల్గొన్నారు.