కొవ్వు కాలేయ వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల్ని కలిగిస్తుంది. కావున
కొలెస్ట్రాల్ ను కరిగించుకునేందుకు వీటిని తినడం మంచిది.
సోయా:
ప్రతిరోజూ కనీసం 25 గ్రాముల సోయాని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 5-6 శాతం
తగ్గిస్తుంది.
ఆరెంజ్ జ్యూస్:
ఆరెంజ్ జ్యూస్ లో స్టెరాల్స్, స్థానాల్స్ నిండి ఉన్నాయి. కొలెస్ట్రాల్ ని 10
శాతం గ్రహిస్తాయి.
నూనెలు:
కనోలా, పొద్దుతిరుగుడు నూనె వంటి నూనెలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని
తగ్గిస్తాయి.
తృణధాన్యాలు:
తృణధాన్యాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో
సహాయపడతాయి.
బీన్స్:
బీన్స్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.వీటిని తినడం వల్ల పొట్ట నిండుగా
ఉంటుంది.
స్ట్రాబెర్రీలు:
స్ట్రాబెర్రీలు పెక్టిన్ తో నిండి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్థాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తాయి.
గింజలు:
బాదం, వాల్ నట్, వేరుశెనగ
వంటి గింజలు గుండెకి మంచిది. వీటిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ 5శాతం
తగ్గిపోతుంది.