సమయంలో నీరు తాగుతున్నాం అన్నది కూడా ముఖ్యమే. రోజులో ముఖ్యంగా కొన్ని
సమయాల్లో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
నిద్రలేవగానే:
నిద్రలేవగానే ఓ గ్లాస్ వాటర్ తాగడం వల్ల నిద్ర మబ్బు తొలగిపోతుంది. మెదడు
ఉత్తేజితమవుతుంది. బాడీ నుంచి విష పదార్థాలు పోవడానికి ఈ నీరు సహాయపడుతుంది.
తినే ముందు:
భోజనం చేయడానికి అరగంట ముందు వాటర్ తాగితే ఎంతో మంచిది. ఇది తిన్న ఆహారం
జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.
వ్యాయామం సమయంలో:
వ్యాయమం చేసే ముందు ఆ తర్వాత ఓ గ్లాస్ నీటిని తాగడం అవసరం. ఇది శరీరం
డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడుతుంది. వర్కౌట్ మధ్యలో కూడా నీటిని తాగడం
మంచిదే.
స్నానానికి ముందు:
స్నానం చేయడానికి కాస్త ముందు ఓ గ్లాస్ వాటర్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇది రక్తపోటును తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.
నిద్రకు ముందు:
పడుకోవడానికి గంట ముందు వాటర్ తాగడం వల్ల కూడా అనేక ఉపయోగాలున్నాయి. నిద్రపోయే
ముందు బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవడం వల్ల గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం
తగ్గుతుంది.
అలసిపోయినపుడు:
పని చేసి అలసిపోయినపుడు ఓ గ్లాస్ వాటర్ తాగడం చాలా మంచిది. ఇది మీ మెదడును
ఉత్తేజపరిచి మిమ్మల్ని ఉల్లాసంగా మారుస్తుంది.
అనారోగ్య సమయంలో:
అనారోగ్యం బారిన పడినపుడు ఎక్కువగా నీళ్లు తాగడం చాలా అవసరం. ఇది బాడీ
కోల్పోయిన లవణాల్ని తిరిగి పొందేలా చేస్తుంది.