చేయడంతో పాటు ఈ పోషకాహార పదార్దాలను తీసుకోండి..
పెరుగు:
పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఏ, డీ కంటెంట్ ఎక్కువగా
ఉంటుంది. ఇవి కండరాలను దృఢంగా మార్చడంలో సహాయపడతాయి. పెరుగు తినడంతో ఎముకలు
దృఢంగా మారుతాయి.
పాలు:
పాలలో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న
విటమిన్ ఏ, డీలు కండరాలను ధృఢంగా మార్చుతాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది.
ఆకుకూరలు:
ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూర, కాలే, బచ్చలి కూర తినడంతో
ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడంతో
వ్యాధినిరోధకశక్తి మెరుగుపడుతుంది.
చీజ్:
చీజ్ కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న విటమిన్ ఏ, బీ12, జింక్
కంటెంట్ ఎముకలను దృఢంగా మార్చుతాయి. రెగ్యులర్ గా చీజ్ తినడంతో కండరాలు దృఢంగా
మారుతాయి.
చేపలు:
సాల్మన్, ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్ తినడంతో కండరాలు దృఢంగా మారుతాయి. ఇందులో
విటమిన్ డీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలను, కండరాలను దృఢంగా
మార్చుతాయి.
బ్రోకలి:
బ్రోకలిలో కాల్షియం, విటమిన్ సీ, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
బ్రోకలిని ఆహారంలో భాగం చేసుకోవడంతో ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి.
విత్తనాలు:
వివిధ రకాల విత్తనాలు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ప్రోటీన్,
ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, ఫాస్పరస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి
విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు కండరాలను దృఢంగా మారుతాయి.
గుడ్లు:
గుడ్లు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుడ్లలో విటమిన్లు, మినరల్స్
పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉన్న కాల్షియం కంటెంట్ ఎముకలను, కండరాలను దృఢంగా
మార్చుతుంది.