1.కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్, 18
రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి.
2.దీనిలో కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము,
పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి.
3.కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్,
యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉంటాయి.
4.ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. కలబందలో
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
5.ఇవి శరీరంలోని టాక్సిన్స్ నీ బయటకు పంపి, శరీరాన్ని శుభ్రం చేస్తాయి.
6.శరీరంలో టాక్సిన్స్ తొలగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది, పోషకాలను
గ్రహిస్తుంది. దాంతో తొందరగా బరువు తగ్గుతారు.
7.డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగడం వల్ల ఎంతో
మేలు జరుగుతుంది.
8.కలబందలో లెక్టిన్ లు ఆంత్రాక్వినోన్స్ ఉంటాయి. వీటిలో సహజంగా రక్తంలో
గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.
9.రక్తంలో చక్కెర చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో
ఉంచుతుంది.
10.షుగర్ పేషెంట్స్ కలబంద జ్యూస్ తాగేముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారి రక్తంలో చక్కెర నిల్వలు
నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి కలబంద రసాన్ని సప్లిమెంట్‌గా
తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగుపడతాయి.
11.మలబద్ధకంతో బాధపడేవారికి కలబంద ఔషధంలా పనిచేస్తుంది. కలబందలో విటమిన్ లు,
మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.