విజయవాడ : హార్మొనీ ఇకొటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ
ఉత్పత్తులను విడుదల చేసారు. తాజ్ వివంతా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ
ఎండీ నరసింహరావు మాట్లాడుతూ మొక్కలకు సహజ సిద్ధమైన పోషకాలతో కూడిన ఉత్పత్తులు
రైతులకు అందించడానికి మేము కృషి చేస్తున్నామని తెలిపారు. నీటిలో కరిగే
ఎరువులు,సూక్ష్మ పోషకాలు, సూక్ష్మజైవిక ఉత్పత్తులు, సేంద్రీయ ఖనిజ ఎరువులు,
వృక్ష సంగ్రాహ్యక ఉత్పత్తులు, సేంద్రీయ మొక్కల సంరక్షకాలు విడుదల చేశామన్నారు.
చిన్న క్వాంటిటీ లో అమెరికాకు ఎగుమతులు చేస్తూ నైపుణ్యం సంపాదించామన్నారు.
రైతుకు తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తామని తెలిపారు. డీలర్స్
విజయవంతమైన కంపెనీకి వెన్నెముక అని భావిస్తాము. ఈ ప్రయాణంలో మీ కీలక పాత్రను
మేము గుర్తించాము. కలిసి, అచంచలమైన అంకితభావం, సహకార స్ఫూర్తితో వ్యవసాయ
వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు పెంచుదాం అని కంపెనీ డైరెక్టర్లు హర్షా, శ్రీను ,
ఐవిమ్. స్వరూప్ అన్నారు. ప్రతి ప్రొడక్ట్ వెనుక పరిశోధన , కృషి కూడి
ఉంటుంది. తయారు చేసిన ప్రొడక్ట్ మొదటగా కంపెనీ ఆర్ అండ్ డీ ఫార్మ్ లో
టెస్టింగ్ చేసిన తర్వాత ,వాటి రిజల్ట్స్ చూసాకే మార్కెట్ లో విడుదల చేస్తామని
తెలిపారు. రసాయన ఎరువులు పర్యావరణానికి భంగం కలిగిస్తాయని భావించానని
అన్నారు. కానీ కొన్ని సార్లు వాటిని ఉపయోగించడం తప్పదు అని అన్నారు. రైతుకి ఏఏ
సమయాలలో ఏ ఉత్పత్తులను వాడాలనే సమాచారాన్ని తెలియ చేయాలి, అందుకుగాను ఒక కాల్
సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. రైతులకు వారి పంట భూమి సారాన్ని
తెలియచేయడానికి ఉచిత సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు
అనంతరం ముఖ్య అతిధి ఐ.తిరుపాల్ రెడ్డి , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ
సలహాదారులు మాట్లాడుతూ కంపెనీ స్లొగన్స్ ప్రకృతే మా మార్గదర్శి, పుడమి తల్లి
సేవలో బాగా నచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్లు హర్షా, శ్రీను ,
ఐవిమ్. స్వరూప్ కంపెనీ చీఫ్ అఫ్ మార్కెటింగ్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ అల్తాఫ్,
డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.