సియోల్ : ఉత్తర కొరియా నుంచి ఎదురవుతున్న అణ్వస్త్ర ముప్పును
ఎదుర్కోవడానికంటూ అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తున్న
యుద్ధ నౌకా విన్యాసాలపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మండిపడ్డారు.
తమ దేశంపై దండెత్తడానికి ప్రత్యర్థి దేశాలు పన్నుతున్న కుట్రలను నిరంతరం భగ్నం
చేయడానికి సైన్యం సదా సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా నౌకా
దళ దినోత్సవ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అమెరికా దుందుడుకు చర్యలు కొరియా
ద్వీపకల్ప జలాల్లో అణు యుద్ధాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉందని తెలిపారు.
అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాధ్యక్షులను గూండా నాయకులుగా కిమ్
వర్ణించారు.