తెలుగుదేశం అధికార ప్రతినిధి సయ్యిద్ రఫీ
అమరావతి : ప్రత్యేక హోదాకు అడ్డుపడి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన
ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవ్‌ని తక్షణమే ఏపీ నుంచి తొలగించి కేంద్రానికి
సరేండర్ చేయాలని తెలుగుదేశం అధికార ప్రతినిధి సయ్యిద్ రఫీ కోరారు. మంగళవారం
రఫీ మీడియాతో మాట్లాడుతూ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్లానింగ్ కమిషన్
సమావేశాలకు ఐదు సార్లు హాజరుకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక
హోదాను రాకుండా అడ్డుకున్న రజిత్ భార్గవ్ లాంటి వాళ్లకు ఏపీలో ఉండే అర్హత
లేదని చెప్పారు. జగన్‌రెడ్డి తక్షణం రజిత్ భార్గవ్‌ని సాగనoపి ప్రత్యేక హోదాపై
ఏపీ ప్రజలకు తన నిజాయితీ రుజువు చేసుకోవాలని సయ్యిద్ రఫీ అన్నారు.