విజయవాడ : వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం పురంధేశ్వరి మీడియాతో
మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ధరలు అన్ని ఎల్ పీ జీ వినియోగదారులకు 200 రూపాయలు
తగ్గినట్లు చెప్పారు.ఇప్పుడు సిలిండర్ ధర 1,100 రూపాయలకు బదులుగా 900 రూపాయలకే
వస్తుందన్నారు.సుమారు 10 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులు 700 రూపాయలకే సిలిండర్
అందుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అదనంగా 75 లక్షల
ఉజ్వల కనెక్షన్లను ఆమోదించిందని తెలిపారు. ఇది పీ ఎం యు వై కింద మొత్తం
లబ్ధిదారులను 10.35 కోట్లకు తీసుకువెళ్తుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.