ప్రతిపాదనలపై ఈ నెల 29న సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. దీనిలో
భాగంగా ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమవేశం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 3
గంటలకు చర్చలకు రావాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలకు
ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే ఉద్యోగ సంఘాలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.
జీపీఎస్ అంటేనే ఉద్యోగులకు నమ్మక ద్రోహం
ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ నేత కె.రాజేష్
‘‘రాష్ట్రంలో 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులంతా కోరుకునేది పాత పెన్షన్
విధానాన్నే. జీపీఎస్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలను ఎందుకు బయటపెట్టడం
లేదు. లక్షల మంది ఉద్యోగులకు సంబధించిన అంశంపై హడావుడిగా ఆర్డినెన్స్ ఎందుకు
తెస్తున్నారు. సెప్టెంబర్‌లో జరిగే శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు
పెడితే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో చర్చిస్తే లోటుపాట్లూ బయటకు
వస్తాయి. ఉద్యోగులను తప్పుదోవ పట్టించి గందరగోళానికి గురిచేస్తుంది. జీపీఎస్
అంటేనే ఉద్యోగులకు నమ్మక ద్రోహం చేయటమే. ప్రభుత్వం జీపీఎస్‌పై పెట్టిన
సమావేశానికి సీపీఎస్ సంఘాలను ఆహ్వానించకపోవటం శోచనీయం’’ అన్నారు.
అంతటా అమలయ్యేది ఇక్కడెందుకు భారం?
ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ నేత ఎన్.ప్రసాద్
‘‘బయటకు సీపీఎస్ రద్దు చేసేశామని ప్రభుత్వం ఒట్టిమాటలు చెబుతోంది. జీపీఎస్
దేశానికి ఆదర్శమని సీఎం చెబుతున్నారు. మరి ఓపీఎస్ అమలు చేస్తున్న రాష్ట్రాలు
దేనికి ఆదర్శం? మెరుగైన జీపీఎస్ అని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగుల దృష్టికి
ఎందుకు తేవటం లేదు. ప్రతిపాదనలపై చర్చించిన తర్వాతే కేబినెట్ ఆమోదం
తీసుకోవాలి. అలా జరగలేదంటే అసలు మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించే అంశానికీ విలువ
లేకుండానే పోతుంది. ఓపీఎస్‌ను అమలు చేస్తున్న రాష్ట్రాలనే ఏపీ ఆదర్శంగా
తీసుకోవాలని కోరుతున్నాం. దేశంలో ఇతర ప్రాంతాల్లో అమలయ్యేది ఇక్కడ ఎందుకు భారం
అవుతుంది?’’
అధికారులెవరూ స్పష్టత ఇవ్వకపోతే ఎలా?
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి
జీపీఎస్ విధానాన్ని కేబినెట్ ఆమోదించిన విషయం ఉద్యోగ సంఘాలెవరికీ తెలియదు.
జీపీఎస్‌పై ప్రభుత్వం ఏం ప్రతిపాదిస్తోందో ఏ ఉద్యోగ సంఘానికీ స్పష్టత లేదు.
పీఆర్సీ, కాంట్రిబ్యూషన్ మినహా ఓపీఎస్లోని అన్ని అంశాలూ జీపీఎస్‌లో ఉంటాయని
ముఖ్యమంత్రే చెప్పారు. ఇదే అంశాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అధికారులకు
చెప్పాం. జీపీఎస్‌లో కమ్యుటేషన్‌పై అధికారులెవరూ స్పష్టత ఇవ్వకపోతే ఎలా?’’