పండ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఈ పండ్లని రెగ్యులర్ గా తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివిధ వ్యాధుల నుంచి
దూరంగా ఉండవచ్చు.
అరటి:
అరటిని తినడంతో తక్షణ శక్తి లభిస్తుంది. అరటి కండరాలను దృఢంగా మార్చుతుంది.
అరటిలో ఉన్న పిండిపదార్ధాలు, పొటాషియం, విటమిన్ బి6 శక్తిని రెట్టింపు
చేస్తాయి.
నారింజ:
నారింజలో విటమిన్ సీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నారింజ తినడంతో శరీరానికి
కావాల్సిన శక్తి సులభంగా అందుతుంది. నారింజ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి
కణాలను ఆరోగ్యంగా మార్చుతుంది. వ్యాయామం తర్వాత అలసటను తగ్గిస్తుంది.
బెర్రీస్:
బెర్రీస్ తో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని
తగ్గిస్తాయి. శక్తిని రెట్టింపు చేస్తాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.
కండరాలను దృఢంగా మార్చుతుంది.
యాపిల్:
ప్రతిరోజూ ఒక యాపిల్ తినడంతో వైద్యుడికి దూరంగా ఉండవచ్చు. యాపిల్లో ఫైబర్
కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. యాపిల్
తినడంతో శక్తి రెట్టింపు అవుతుంది.
పైనాపిల్:
పైనాపిల్ బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా
మార్చుతుంది. ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. శక్తిని రెట్టింపు చేస్తుంది.
దానిమ్మ:
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి
కండరాలను ధృడంగా మార్చుతాయి. ప్రతిరోజూ దానిమ్మ తినడంతో శక్తి రెట్టింపు
అవుతుంది.
కివీ:
కీవీ తినడంతో శరీరానికి కావాల్సిన శక్తి సులభంగా అందుతుంది. ఇందులో విటమిన్ సీ
కంటెంట్ అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కివీ సహాయపడుతుంది.
పుచ్చకాయ:
పుచ్చకాయలో ఉండే పోషకాలు శక్తిని పెంచుతాయి. ఇందులో నీటి శాతం అధికంగా
ఉంటుంది. పుచ్చకాయ తినడంతో శక్తి రెట్టింపు అవుతుంది.