అతిగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
1.యాంటీ బయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాధులను మాత్రమే నయం
చేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ ను నయం చేయలేవు.
2.ఈ విషయం తెలియక చాలా మంది వైరస్ వల్ల వచ్చే వ్యాధులకు కూడా యాంటీ బయాటిక్స్
ను వాడుతున్నారు.
3.యాంటీ బయాటిక్స్ అతి వినియోగంతో వ్యాధులు మరింత తీవ్రమవుతాయి. కోలుకోవడానికి
చాలా సమయం పడుతుంది.
4.40ఏళ్లు పైబడిన వారు యాంటీ బయాటిక్స్ ఎక్కువ వాడితే ఇన్ ఫలమేటరీ బొవెల్ ఇల్
నెస్ ను (ఐబీడీ) వచ్చే ప్రమాదం ఉంది.
5.ముఖ్యంగా పేగు సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. అల్సరేటివ్ కొలైటిస్ రిస్క్
కూడా ఉంటుంది.
6.వైద్యులు సూచిస్తేనే యాంటీ బయాటిక్స్ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
7.యాంటీ బయాటిక్స్ వాడకాన్ని పరిమితం చేయడంతో వాటి నిరోధకతను అరికట్టి, ఐబీడీ
రిస్క్ ను కూడా తగ్గించుకోవచ్చు.